Vijay: బొగ్గు స్కాంలో మాజీ ఎంపీ విజయ్‌కు నాలుగేళ్ల జైలు
ABN , First Publish Date - 2023-07-27T01:42:00+05:30 IST
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) బొగ్గు గనుల కేటాయింపుల కుంభకోణం కేసులో రాజ్యసభ మాజీ ఎంపీ విజయ్ దర్దా, ఆయన కుమారుడు దేవేందర్ దర్దా, వ్యాపారవేత్త మనోజ్‌కుమార్ జైస్వాల్(Manoj Kumar Jaiswal)కు ఢిల్లీ కోర్టు(Court of Delhi) బుధవారం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.
న్యూఢిల్లీ, జూలై 26: ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) బొగ్గు గనుల కేటాయింపుల కుంభకోణం కేసులో రాజ్యసభ మాజీ ఎంపీ విజయ్ దర్దా, ఆయన కుమారుడు దేవేందర్ దర్దా, వ్యాపారవేత్త మనోజ్‌కుమార్ జైస్వాల్(Manoj Kumar Jaiswal)కు ఢిల్లీ కోర్టు(Court of Delhi) బుధవారం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్నారు. అలాగే బొగ్గు శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, మాజీ ప్రభుత్వ అధికారులు కేఎస్ క్రోఫా, కేసీ సమ్రియాకు ప్రత్యేక న్యాయమూర్తి సంజయ్ బన్సాల్ మూడేళ్ల జైలు శిక్ష విధించారు. అయితే వీరు ముగ్గురు హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. ఇటు కేసులో దోషిగా తేలిన జేఎల్‌డీ యావత్మాల్ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్‌కు కోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది. బొగ్గు కుంభకోణంలో పదమూడో నేరారోపణకు సంబంధించిన కేసు ఇది.. నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని కుదిపేసిన ఈ స్కాంకు సంబంధించి ఈనెల 13న కోర్టు మొత్తం ఏడుగురిని దోషులుగా తేల్చిన సంగతి తెలిసిందే.