Free bus passes: ఏప్రిల్ 1 నుంచే మహిళలు, విద్యార్థినులకు ఉచిత బస్‌పాసులు
ABN , First Publish Date - 2023-02-22T12:14:13+05:30 IST
బడ్జెట్‌లో ప్రకటించిన మేరకు ఏప్రిల్ 1నుంచే గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులకు, అసంఘటిత రంగంలోని మహిళలకు ఉచిత బస్సు
- అధికారులకు సీఎం సూచన
- అంబారి ఉత్సవ బస్సులకు పచ్చజెండా
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బడ్జెట్‌లో ప్రకటించిన మేరకు ఏప్రిల్ 1నుంచే గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులకు, అసంఘటిత రంగంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించాలని అధికారులకు సీఎం బసవరాజ్ బొమ్మై(CM Basavaraj Bommai) సూచించారు. నగరంలో మంగళవారం ఆయన కేఎ్‌సఆర్టీసీ అంబారి ఉత్సవ బస్సులకు పచ్చజెండా చూపారు. ఓల్వో మల్టి యాక్సిల్ బీఎస్ 4 - 9600 స్లీపర్ బస్సులను దూరప్రాంత ప్రయాణికుల కోసం ఉద్దేశించారు. రైళ్లలోని ఏసీ కోచ్‌లకు ధీటుగా ఈ బస్సుల్లో అదనపు సదుపాయాలు ఉంటాయని సీఎం తన ప్రసంగంలో వివరించారు. పాఠశాలల కోసం మినీ బస్సులను తాలూకాకు కనీసం ఐదింటిని సిద్ధం చేయాలన్నారు. కేఎస్ఆర్టీసీ(KSRTC) లాభదాయకంగా, డిమాండ్ అధికంగా ఉన్న మార్గాల్లో మరిన్ని బస్సులను నడపడం ద్వారా ప్రైవేట్ రవాణా సంస్థల సవాల్‌ను ధీరోచితంగా ఎదుర్కొనాలన్నారు. ఆర్టీసీలో వృథా ఖర్చులను నియంత్రించి లాభాల బాటలో నడిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొవిడ్ కారణంగా చతికిలపడిన ఆర్టీసీకి రెండేళ్లపాటు రూ.4,600 కోట్లు సమకూర్చి ఆదుకున్నామన్నారు. కార్యక్రమంలో రెవెన్యూశాఖ మంత్రి ఆర్ అశోక్, కేఎస్ఆర్టీసీ చైర్మన్ చంద్రప్ప, ఎమ్మెల్యేలు సోమశేఖరరెడ్డి, సతీశ్‌రెడ్డి, రిటైర్డు అధికారి ఎంఆర్ శ్రీనివాసమూర్తి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి మంజునాథ ప్రసాద్ పాల్గొన్నారు.