Gautami: నటి గౌతమి స్థలం మోసం కేసులో ఆరుగురికి ముందస్తు బెయిల్ పిటిషన్ తోసివేత
ABN , Publish Date - Dec 20 , 2023 | 08:13 AM
సినీ నటి గౌతమి(Film actress Gautami)కి చెందిన భూమిని నకిలీ పత్రాలను సృష్టించి తమ పేరుకు మార్చుకున్న కేసులో ఆరుగురు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్
అడయార్(చెన్నై): సినీ నటి గౌతమి(Film actress Gautami)కి చెందిన భూమిని నకిలీ పత్రాలను సృష్టించి తమ పేరుకు మార్చుకున్న కేసులో ఆరుగురు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను మద్రాస్ హైకోర్టు(Madras High Court) కొట్టివేసింది. రామనాథపురం జిల్లాతో పాటు చెన్నై నీ లాంగరైలో నటి గౌతమికి భూములున్నాయి. వీటిని నకిలీ పత్రాలను సృ ష్టించి విక్రయించారు. దీనిపై గౌతమి ఫిర్యాదు మేరకు కారైక్కుడికి చెందిన సి.అళగప్పన్, ఆయన భార్య నాచ్చాళ్, కుమారుడు శివ, కోడలు ఆర్తి, బంధువు భాస్కర్, కారు డ్రైవర్ సతీష్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయా లంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన జడ్జి సీవీ కార్తికేయన్ పిటిషన్లను తోసిపుచ్చారు.