Google Bomb Call: పుణె గూగుల్ ఆఫీసుకు బాంబు బెదరింపు, హైదరాబాద్‌లో ఒకరి అరెస్టు
ABN , First Publish Date - 2023-02-13T13:24:00+05:30 IST
మహారాష్ట్రలోని పుణె సిటీ గూగుల్ కార్యాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఆఫీసు ఆవరణలో బాంబు అమర్చినట్టు అజ్ఞాత వ్యక్తి నుంచి..
పుణె: మహారాష్ట్రలోని పుణె సిటీ (Pune City) గూగుల్ కార్యాలయానికి (Google office) బాంబు బెదిరింపు (Bomb threat) వచ్చింది. ఆఫీసు ఆవరణలో బాంబు అమర్చినట్టు అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడంతో సిబ్బంది, యాజమాన్యం అప్రమత్తమైంది. పోలీసులు కార్యాలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన మీదట అది ఉత్తు్త్తి బెదరింపేనని తేలింది. మద్యం మత్తులో అజ్ఞాత వ్యక్తి ఈ బెదరింపు కాల్ చేసినట్టు చెబుతున్నారు. ఆ వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన పనయం శివానంద్‌గా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
''పుణెలోని ముంద్వా ప్రాంతం బహుళ అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ 11వ ఫ్లోర్‌లో గూగుల్ కార్యాలయం ఉంది. ఆఫీసు ఆవరణలో బాంబు పెట్టిన సమాచారం ఆదివారం రాత్రి మాకు అందింది. వెంటనే పుణె పోలీసులు, బాంబ్ డిస్కోజల్ స్క్వాడ్ అక్కడు చేరుకుని విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు'' అని జోన్-5 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విక్రాంత్ దేశ్‌ముఖ్ తెలిపారు. గూగల్ కార్యాలయ ఆవరణలో బాంబు అమర్చడం ఉత్తతే అని తేలడంతో కాలర్ ఆచూకీ ట్రేస్ చేశామని, హైదరాబాద్‌లో అతన్ని అదుపులోనికి తీసుకున్నామని చెప్పారు. మద్యం తాగిన మత్తులో అతను ఫోన్ చేసినట్టు తెలుస్తోందని అన్నారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్టు డీసీపీ దేశ్‌ముఖ్ తెలిపారు.