Governor: మళ్లీ గవర్నర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-05-13T09:07:08+05:30 IST

గవర్నర్ ఆర్‌ఎన్‌ రవి మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..

Governor: మళ్లీ గవర్నర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): తమిళ, సంస్కృత భాషల్లో ఏది ప్రాచీన మైనదో ఇదమిత్థంగా తెలియదంటూ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) మరో కొత్త వివాదానికి తెరలేపారు. రాజ్‌భవన్‌లో శుక్రవారం ఉదయం ‘ఏక భారతం మహోన్నత భారతం’ పథకం కింద విద్యార్థులతో ముచ్చటించిన గవర్నర్‌... ఎన్నో వేల సంవత్సరాలకు మునుపే సంస్కృతీ, నాగరికతల అభివృద్ధి ద్వారా మాత్రమే భారతదేశం ఆవిర్భవించిందని, భారతం అనేది 1947లో ఏర్పడి నట్లు పలువురు భావిస్తుండటం శోచనీయమని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రెండు వేల సంవత్సరాలకు మునుపే భారతం ఆవిర్భవించిందన్నారు. తమిళభాష, సంస్కృత భాష ప్రాచీనమైనవని చెబుతారని, అయితే వీటిల్లో ఏదీ ప్రాచీనమైనదన్న ప్రశ్నకు ఇప్పటి వరకూ సమాధానమే లేదన్నారు. సంస్కృతం ప్రాచీనభాషా? లేక తమిళం ప్రాచీనభాషా? అనే వివాదం ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. పలు శతాబ్దాలకు పూర్వం రాజులు పరిపాలిస్తున్నప్పుడు ప్రజలు ఏ ప్రాంతానికైనా వెళ్ళి వచ్చే అవకాశాలు ఉండేవని, అలాంటి సందర్భాలలోనే తమిళ భాష నుంచి సంస్కృతంలోకి కొన్ని పదాలు చేరాయని చెప్పారు. అదే కోవలోనే సంస్కృతం నుంచి కొన్ని పదాలు తమిళభాషలో చేరాయని గవర్నర్‌ పేర్కొన్నారు.

Updated Date - 2023-05-13T09:07:08+05:30 IST