Governor: గవర్నర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. నేను వారిని బద్ధ శత్రువులుగానే భావిస్తా..

ABN , First Publish Date - 2023-07-23T08:56:03+05:30 IST

రాష్ట్రాభివృద్ధిని, దేశాభివృద్ధిని అడ్డుకునేవారిని తాను బద్ధ శత్రువులుగానే భావిస్తానని, 130 కోట్ల మంది జనాభా కలిగిన దేశంలో ప్రజలకు ప్ర

Governor: గవర్నర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. నేను  వారిని బద్ధ శత్రువులుగానే భావిస్తా..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాభివృద్ధిని, దేశాభివృద్ధిని అడ్డుకునేవారిని తాను బద్ధ శత్రువులుగానే భావిస్తానని, 130 కోట్ల మంది జనాభా కలిగిన దేశంలో ప్రజలకు ప్రభుత్వమే అన్ని సదుపాయాలు కల్పించడం సాధ్యపడదని, నిరుద్యోగ యువకులు పారిశ్రామికవేత్తలుగా మారి ప్రజల సంక్షేమానికి పాటుపడాలని రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(State Governor RN Ravi) అన్నారు. రాజ్‌భవన్‌లో శనివారం ఉదయం ‘సాహసోపేతమైన ఆలోచనతో ముందుకెళ్ళండి’ పేరిట విద్యార్థులు, ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక సమా వేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ దేశం అభివృద్ధి సాధించాలంటే ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిన అవ సరం ఉందన్నారు. గవర్నర్లకు పనిభారం ఎక్కువగా ఉంటుందని ప్రజానీకం అపోహపడుతోందని, వాస్తవానికి గవర్నర్‌గా తనకు తక్కువ పనులే ఉన్నాయని ఆయన చమత్కరించారు. విద్యార్థులు ఉద్యోగాన్వేషణలకే అధిక సమయాన్ని కేటాయించకుండా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగామారి పలువురి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ప్రగతిపథంలో పయనిస్తున్న భారతదేశం త్వరలోనే సంపన్న దేశంగా మారడం తథ్యమని, ఆ దిశగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు మరిన్ని స్టార్ట్‌అప్‌లను ప్రారంభించాలని ఆయన పిలుపునిచ్చారు.

nani4.jpg

Updated Date - 2023-07-23T08:56:03+05:30 IST