Supreme Court:బిల్లులపై నాన్చివేత ధోరణి వద్దు.. గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి
ABN , First Publish Date - 2023-11-06T15:03:27+05:30 IST
రాష్ట్ర శాసనసభ ఆమోదం పొందిన బిల్లులను ఎటూ తేల్చకుండా వాటి విషయంలో గవర్నర్లు(Governors) నాన్చివేత ధోరణిని అవలంబిస్తున్నారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి సంస్కృతికి ముగింపు పలకాలని సూచించింది. పంజాబ్(Punjab) అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల విషయంలో గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్(Banwarilal Purohi) ఎటూ తేల్చకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఢిల్లీ: రాష్ట్ర శాసనసభ ఆమోదం పొందిన బిల్లులను ఎటూ తేల్చకుండా వాటి విషయంలో గవర్నర్లు(Governors) నాన్చివేత ధోరణిని అవలంబిస్తున్నారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి సంస్కృతికి ముగింపు పలకాలని సూచించింది. పంజాబ్(Punjab) అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల విషయంలో గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్(Banwarilal Purohit) ఎటూ తేల్చకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. "రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన బిల్లుల విషయంలో గవర్నర్లు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు వరకు ఈ విషయాల్ని లాగొద్దు. గవర్నర్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారు ప్రజాప్రతినిధులు కాదు" అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్(Chief Justice DY Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం, పంజాబ్ గవర్నర్ తీసుకున్న చర్యలపై తాజా స్థితి నివేదికను సమర్పించాలని సొలిసిటర్ జనరల్(Solicitor General) తుషార్ మెహతాను ఆదేశించింది.
అనంతరం ఈ కేసును శుక్రవారానికి వాయిదా వేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో పంజాబ్ అసెంబ్లీ ఆమోదించిన 27 బిల్లుల్లో 22 బిల్లులకు పురోహిత్ ఆమోదం తెలిపారు. చాలా రాష్ట్రాల్లో సీఎంకు గవర్నర్ లకు ఉన్న వైరంలాగే పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య వైరం నెలకొంది. ఇటీవలే పంజాబ్ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల ఆమోదానికి గవర్నర్ తాత్సారం చేయడంతో ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. నవంబర్ 1న, పురోహిత్.. భగవంత్ మాన్‌కు లేఖ రాసిన కొన్ని రోజుల తర్వాత, మూడు ద్రవ్య బిల్లులలో రెండింటికి ఆమోదం తెలిపారు. సభలో ద్రవ్య బిల్లులు పెట్టాలంటే గవర్నర్ ఆమోదం తప్పనిసరి. అయితే, అక్టోబరు 19న సీఎంకు రాసిన లేఖలో గవర్నర్ మూడు ద్రవ్య బిల్లుల ఆమోదాన్ని నిలిపేశారు. వాటిల్లో పంజాబ్ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ (సవరణ) బిల్లు, 2023 - పంజాబ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (సవరణ) బిల్లు - 2023, ఇండియన్ స్టాంప్ (పంజాబ్ సవరణ) బిల్లు - 2023కి పురోహిత్ ఉన్నాయి. బడ్జెట్ సెషన్‌కు పొడిగింపుగా అక్టోబర్ 20-21న నిర్వహించిన సెషన్ చట్టవిరుద్ధం అని గవర్నర్ గతంలో వ్యాఖ్యానించారు. తాజా తీర్పు అనంతరం పరిణామాలను కొద్ది రోజుల్లో సుప్రీంకోర్టు ముందు ఉంచుతామని సొలిసిటర్ జనరల్ చెప్పారు. గవర్నర్ తీసుకున్న చర్యలను కోర్టు ముందు ఉంచాలని న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలు స్పష్టం చేశారు.