Gujarat : గోద్రా అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా గుజరాత్ అసెంబ్లీ తీర్మానం
ABN , First Publish Date - 2023-03-11T07:35:23+05:30 IST
గుజరాత్ రాష్ట్రంలోని గోద్రా అల్లర్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా గుజరాత్ అసెంబ్లీ...
అహ్మదాబాద్ (గుజరాత్): గుజరాత్ రాష్ట్రంలోని గోద్రా అల్లర్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా గుజరాత్ అసెంబ్లీ తీర్మానం చేసింది.(Gujarat Assembly) గత నెలలో విడుదలైన బీబీసీ డాక్యుమెంటరీ దేశంలో పెద్ద దుమారం రేపింది.(resolution against BBC) ‘‘ఈ బీబీసీ డాక్యుమెంటరీ కేవలం మోడీకి వ్యతిరేకంగా కాదు, దేశంలోని 135 కోట్ల మంది పౌరులకు వ్యతిరేకంగా ఉంది’’ అని గుజరాత్ హోంశాఖ మంత్రి వ్యాఖ్యానించారు.
2002 గుజరాత్ అల్లర్లకు(2002 Godhra riots) సంబంధించి ప్రధాని మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని అంశాలను దర్యాప్తు చేసినట్లు బీబీసీ పేర్కొంది. అయితే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆ డాక్యుమెంటరీ(documentary) నిష్పాక్షికత లేనిదని పేర్కొంది.
డాక్యుమెంటరీలో 2002 అల్లర్ల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత్ర ఉందని తేల్చింది.జనవరి 21వతేదీన బీబీసీ డాక్యుమెంటరీకి లింక్‌లను పంచుకునే బహుళ యూట్యూబ్ వీడియోలు ,ట్విట్టర్ పోస్ట్‌లను బ్లాక్ చేయాలని కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.వివాదాస్పద డాక్యుమెంటరీ నేపథ్యంలో భారతదేశంలో బీబీసీపై పూర్తి నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.