Hemanth Sorean: ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం.. అందులో ఏం ఉందంటే?

ABN , First Publish Date - 2023-09-27T19:35:46+05:30 IST

జార్ఖండ్(Jharkhand) లో ఆదివాసీల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో గిరిజనుల కోసం 'సర్నా' మతపరమైన కోడ్ ని గుర్తించాలని కోరుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(Hemanth Sorean) ప్రధాన మోదీ(PM Modi)కి ఇవాళ లేఖ రాశారు. ఆ లేఖలో.. ఆదివాసీల సంప్రదాయ మత ఉనికిని రక్షించే ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పారు.

Hemanth Sorean: ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం.. అందులో ఏం ఉందంటే?

జార్ఖండ్: జార్ఖండ్(Jharkhand) లో ఆదివాసీల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో గిరిజనుల కోసం 'సర్నా' మతపరమైన కోడ్ ని గుర్తించాలని కోరుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(Hemanth Sorean) ప్రధాన మోదీ(PM Modi)కి ఇవాళ లేఖ రాశారు. ఆ లేఖలో.. ఆదివాసీల సంప్రదాయ మత ఉనికిని రక్షించే ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పారు. 8 దశాబ్దాలలో రాష్ట్రంలో గిరిజన జనాభా 38% నుండి 26%కి తగ్గిందని అన్నారు. వారి జనాభా తగ్గుదల ఆందోళనకరంగా ఉందని సోరెన్ అన్నారు. దీంతో తమకూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుతూ గిరిజనులు(Tribals) సర్నా మత కోడ్ కోసం డిమాండ్ లేవనెత్తుతున్నారు.


ప్రస్తుతం, యూనిఫాం సివిల్ కోడ్ కోసం కొందరు డిమాండ్ చేస్తుండగా తమకూ ఈ కోడ్ అవసరమని స్థానికులు అంటున్నారు. తదుపరి జనాభా గణనలో సర్నా కోడ్‌ను ప్రత్యేక మతపరమైన కోడ్‌గా కోరడం గిరిజన సమూహాల దీర్ఘకాల డిమాండ్. నవంబర్ 11, 2021న, జార్ఖండ్ అసెంబ్లీ ఈ కోడ్ ని ఏకగ్రీవం ఆమోదించింది. మే 25న, సోరెన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu)కు లేఖ రాస్తూ ఇదే అంశాన్ని లేవనెత్తారు. గిరిజనులను కాపాడుకోకపోతే వారి భాష, సంస్కృతి శాశ్వతంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 1951 సెన్సస్‌లో గిరిజనులకు ప్రత్యేక మతపరమైన కాలమ్ ఉండేదని, అయితే కొన్ని కారణాల వల్ల ఆ కాలాన్ని జాబితా నుండి తొలగించారని సోరెన్ చెప్పారు. మతపరమైన గుర్తింపు గిరిజనుల సంస్కృతి, పద్ధతులను సంరక్షించడంలో సహాయపడుతుందని ఆయన వెల్లడించారు.

Updated Date - 2023-09-27T19:35:46+05:30 IST