Hero Vijay Antony: నీ జ్ఞాపకాలతో చచ్చిపోతున్నా !
ABN , First Publish Date - 2023-10-10T10:46:58+05:30 IST
హీరో విజయ్ ఆంటోని(Hero Vijay Antony) పెద్ద కుమార్తె మీరా ఇటీవల ఆత్మహత్య చేసుకోగా, ఆమె మృతిని ఆ దంపతులు
- ఫాతిమా విజయ్ ఆంటోని
అడయార్(చెన్నై): హీరో విజయ్ ఆంటోని(Hero Vijay Antony) పెద్ద కుమార్తె మీరా ఇటీవల ఆత్మహత్య చేసుకోగా, ఆమె మృతిని ఆ దంపతులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. తన కుమార్తె లేని విషయాన్ని తట్టుకోలేక విజయ్ ఆంటోని సతీమణి, నిర్మాత ఫాతిమా సోమవారం ఒక ట్వీట్ చేశారు. ‘మాతో నువ్వు 16 సంవత్సరాలు మాత్రమే జీవిస్తావని తెలిసివుంటే, నిన్ను నా దగ్గరే ఉంచుకునేదాన్ని. ఆ సూర్యచంద్రులను కూడా నీకు చూపించి ఉండను. నేను ప్రతి రోజూ నీ జ్ఞాపకాలతో చచ్చిపోతున్నా. నువ్వు లేకుండా జీవించలేను. అమ్మానాన్నల వద్దకు తిరిగి రా. నీ చెల్లి లారా నీ కోసం ఎదురు చూస్తోంది. లవ్ యూ తంగం’ అంటూ ట్వీట్ చేశారు. కాగా, గతంలో విజయ్ ఆంటోని కూడా తన కుమార్తెతో పాటు తాను చనిపోయాను అంటూ ఒక ఎమోషనల్ ట్వీట్ చేసిన విషయం తెల్సిందే.