Hero Vijay: ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘన.. అపరాధం చెల్లించిన అగ్రహీరో

ABN , First Publish Date - 2023-07-13T10:23:27+05:30 IST

అగ్రహీరో విజయ్‌(Hero Vijay) ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించారు. దీంతో ఆయనకు గ్రేటర్‌ చెన్నై ట్రాఫిక్‌ పోలీసులు(Greater Chennai Traffic Police) రూ.500 అపరా

Hero Vijay: ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘన.. అపరాధం చెల్లించిన అగ్రహీరో

అడయార్‌(చెన్నై): అగ్రహీరో విజయ్‌(Hero Vijay) ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించారు. దీంతో ఆయనకు గ్రేటర్‌ చెన్నై ట్రాఫిక్‌ పోలీసులు(Greater Chennai Traffic Police) రూ.500 అపరాధం విధించడంతో ఆయన ఈ మొత్తాన్ని చెల్లించారు. నగర శివారు ప్రాంతమైన పనైయూరులో విజయ్‌ మక్కల్‌ ఇయ్యక్కంకు చెందిన జిల్లా నిర్వాహకులతో విజయ్‌ మంగళవారం నుంచి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి వచ్చే సమయంలో విజయ్‌ కారు ‘అక్కరై’ అనే ప్రాంతంలోని ఓ ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఆగకుండానే ముందుకు వెళ్ళిపోయిన దృశ్యం సీసీ కెమెరాల్లో నమోదైంది. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు.. ఆయనకు ‘స్టాప్‌ లైన్‌ వైలేషన్‌’ కింద రూ.500 అపరాధం విధించారు. ఈ మొత్తాన్ని ‘జోసెఫ్‌ విజయ్‌ సి’ పేరుతో పేటీఎం డిజిటల్‌ విధానంలో చెల్లించారు.

Updated Date - 2023-07-13T10:23:27+05:30 IST