High Court: నటి చిత్ర కేసును 6 వారాల్లో పూర్తి చేయండి
ABN , First Publish Date - 2023-08-26T08:25:32+05:30 IST
బుల్లితెర నటి చిత్ర మృతి కేసు విచారణను ఆరు వారాల్లో ముగించాలని తిరువళ్లూరు జిల్లా మహిళా కోర్టును మద్రాస్
- మహిళా కోర్టుకు హైకోర్టు ఆదేశం
అడయార్(చెన్నై): బుల్లితెర నటి చిత్ర మృతి కేసు విచారణను ఆరు వారాల్లో ముగించాలని తిరువళ్లూరు జిల్లా మహిళా కోర్టును మద్రాస్ హైకోర్టు(Madras High Court) ఆదేశించింది. 2020, డిసెంబరు నెలలో బుల్లితెర నటి చిత్ర తిరువళ్లూరు జిల్లాలోని నజరత్‌పేటలో ఉన్న ఒక హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ఈ మృతిపై స్థానిక పోలీసులు చిత్ర భర్త హేమ్‌నాథ్(Hemnath)తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. అదేసమయంలో ఈ కేసు విచారణ తిరువళ్లూరు మహిళా కోర్టులలో సాగుతుంది. అయితే, ఈ కేసు విచారణలో జాప్యం నెలకొనడంతో కేసు విచారణనను చెన్నైలోని జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు బదిలీ చేయాలని మృతురాలి తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా హైకోర్టు... చిత్ర మృతి కేసు విచారణను ఆరు వారాల్లో పూర్తి చేయాలని తిరువళ్లూరు మహిళా కోర్టును ఆదేశించింది.