Share News

High Court: మాజీ మంత్రి భార్యకు ఏడాది జైలుశిక్ష సబబే..

ABN , First Publish Date - 2023-11-21T13:33:15+05:30 IST

దివంగత మాజీ మంత్రి పరమశివం భార్య నల్లమ్మాళ్‌కు విధించిన ఏడాది జైలు శిక్షను మద్రాసు హైకోర్టు(Madras High Court) సమర్థించింది.

High Court: మాజీ మంత్రి భార్యకు ఏడాది జైలుశిక్ష సబబే..

- మద్రాసు హైకోర్టు

పెరంబూర్‌(చెన్నై): దివంగత మాజీ మంత్రి పరమశివం భార్య నల్లమ్మాళ్‌కు విధించిన ఏడాది జైలు శిక్షను మద్రాసు హైకోర్టు(Madras High Court) సమర్థించింది. ఆస్తుల కేసుకు సంబంధించి అన్నాడీఎంకే మాజీ మంత్రి పరమశివంకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2000 సంవత్సరంలో వెలువడిన ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన అప్పీలు పిటిషన్‌ విచారణలో ఉండగా 2015లో ఆయన మృతి చెందారు. ఈ నేపథ్యంలో, ప్రత్యేక కోర్టు విధించిన తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన అప్పీలు పిటిషన్‌పై సోమవారం మద్రాసు హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇందులో... ఆదాయానికి మించి రూ.38 లక్షల ఆస్తులు కూడబెట్టారన్న కేసులో పరమశివం భార్య నల్మమ్మాళ్‌కు విధించిన ఏడాది జైలు శిక్షను సమర్థించి, అప్పీలు పిటిషన్‌ తోసిపుచ్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2023-11-21T13:33:17+05:30 IST