Himanta Biswam Sarma: టీమిండియా విజయంపై ప్రేమదుకాణం అభినందనలేవీ..?
ABN , First Publish Date - 2023-10-15T17:38:14+05:30 IST
వరల్డ్ కప్ క్రికెట్‌లో పాకిస్థాన్‌పై భారత టీమ్ సాధించిన గెలుపుపై టీమిండియాను కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul అభినందించకపోవడంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆదివారంనాడు ఛలోక్తులు విసిరారు. దేశం సంతోష, సంబరాల్లో మునిగిపోయిందని, అయితే ''మొహబ్బత్ కీ దుకాణ్'' నుంచి ఒక్క మాట కూడా లేదని అన్నారు.
న్యూఢిల్లీ: వరల్డ్ కప్ క్రికెట్‌లో పాకిస్థాన్‌పై భారత టీమ్ సాధించిన గెలుపుపై టీమిండియాను కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) అభినందించకపోవడంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ (Himanta Biswa Sharma) ఆదివారంనాడు విమర్శించారు. వరల్డ్ కప్ క్రికెట్‌లో పాకిస్థాన్‌ను భారత్ ఓడించడంతో యావద్దేశం సంతోష, సంబరాల్లో మునిగిపోయిందని, అయితే ''మొహబ్బత్ కీ దుకాణ్'' (Mohabbat ki dukan) నుంచి ఒక్క మాట కూడా లేదని రాహుల్ గాంధీని పరోక్షంగా ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు.
''భారత్ జోడో యాత్ర''ను గత ఏడాది ప్రారంభించినప్పటి నుంచి రాహుల్ గాంధీ 'ప్రేమ దుకాణం' (మొహబ్బత్ కీ దుకాణ్) అనే పదాన్ని విరివిగా వాడుతున్నారు. కాగా, వరల్డ్ కప్‌లో విజయాల పరంపరను ఇండియన్ క్రికెట్ టీమ్ కొనసాగిస్తోంది. అహ్మదాబాద్‌లో శనివారంనాడు జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.
పాక్, ఆప్ఘన్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి..
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై కాంగ్రెస్ వైఖరిపై కూడా హిమంత బిస్వా శర్మ ఇటీవల విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్‌లలో కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. పాలస్తీనా ప్రజలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఇటీవల తీర్మానం చేసింది. దీనిపై శర్మ విమర్శలు గుప్పిస్తూ, పాలస్తీనాకు మద్దతు ప్రకటించే ముందు ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రదాడులను కాంగ్రెస్ ఖండిచాలన్నారు. మహిళలు, పిల్లలను బందీలుగా పట్టుకున్న హమాస్‌ను ముందు విమర్శించి ఆ తర్వాత పాలస్తీనా గురించి మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.