Share News

Manipur peace agreement: మణిపూర్‌లో చారిత్రక ఘట్టం.. యుఎన్ఎల్‌ఎఫ్‌తో కేంద్రం శాంతి ఒప్పందం

ABN , First Publish Date - 2023-11-29T19:23:31+05:30 IST

జాతుల మధ్య ఘర్షణ, హింసాత్మక ఘటనలతో అట్టుడికిన మణిపూర్‌ లో తిరిగి శాంతి పవనాలు నెలకొనే దిశగా కీలక అడుగుపడింది. సాయుధ యునైటెడ్ నేషనల్ లిబరేష్ ఫ్రంట్, కేంద్రం మధ్య శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బుధవారంనాడు ప్రకటించారు.

Manipur peace agreement: మణిపూర్‌లో చారిత్రక ఘట్టం.. యుఎన్ఎల్‌ఎఫ్‌తో కేంద్రం శాంతి ఒప్పందం

న్యూఢిల్లీ: జాతుల మధ్య ఘర్షణ, హింసాత్మక ఘటనలతో అట్టుడికిన మణిపూర్‌ (Manipur)లో తిరిగి శాంతి పవనాలు నెలకొనే దిశగా కీలక అడుగుపడింది. సాయుధ యునైటెడ్ నేషనల్ లిబరేష్ ఫ్రంట్ (UNLF), కేంద్రం మధ్య శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) బుధవారంనాడు ప్రకటించారు. హింసను విడనాడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు యూఎన్ఎల్ఎఫ్ అంగీకరించింది. యూఎన్ఎల్‌ఎఫ్‌, కేంద్రం మధ్య శాంతి ఒప్పందం కుదరడానికి చారిత్రక మైలురాయి (Historical Milestone)గా అమిత్‌షా అభివర్ణించారు.


''చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈశాన్యంలో శాశ్వత శాంతి నెలకొనేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత కృషిలో భాగంగా యూనైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఈరోజు ఢిల్లీలో శాంతి ఒప్పందంపై సంతకాలు చేసింది. లోయలో పూరాతన సాయుధ సంస్థ అయిన యూఎన్ఎల్ఎఫ్ హింసను విడనాడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు అంగీకరించింది. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియను నేను స్వాగతిస్తున్నాను. శాంతి, ప్రగతి దిశగా సాగే ఈ ప్రయాణంలో వారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తు్నాను'' అని అమిత్‌షా ట్వీట్ చేశారు.


యూఎన్ఎల్ఎఫ్, భారత ప్రభుత్వం, మణిపూర్ ప్రభుత్వం మధ్య కుదిరిన శాంతి ఒప్పందంతో మణిపూర్‌లో ఆరు దశాబ్దాల సాయుధ ఉద్యమానికి తెరపడినట్టు అమిత్‌షా తెలిపారు. సమ్మిళిత అభివృద్ధి, ఈశాన్యభారత యువతకు ఉజ్వల భవిష్యత్తు కల్పించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కలను సాకరం చేసే దిశగా ఈ ఒప్పందం చారిత్రక మైలురాయిగా నిలుస్తుందన్నారు.

Updated Date - 2023-11-29T19:29:22+05:30 IST