Home Minister: నేనెందుకు ముఖ్యమంత్రి కాకూడదో చెప్పండి..

ABN , First Publish Date - 2023-06-15T13:24:01+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో అధిష్టానం ఇద్దరితో చర్చించి

Home Minister: నేనెందుకు ముఖ్యమంత్రి కాకూడదో చెప్పండి..

- కొత్త చర్చకు తెరలేపిన పరమేశ్వర్‌

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో అధిష్టానం ఇద్దరితో చర్చించి ఒప్పించింది. ఈ నేపథ్యంలో తాజాగా హోంశాఖ మంత్రి పరమేశ్వర్‌(Home Minister Parameshwar) చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ‘నేనెందుకు సీఎం కాకూడదు.. ఉద్దేశ్యపూర్వకంగానే దళితులను సీఎం కాకుండా అడ్డుకుంటున్నారు..’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దళిత సంఘాలు మంగళవారం ఎస్సీల సమావేశం నిర్వహించగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి పరమేశ్వర్‌ తన మనసులోని భావాలను బహిర్గతం చేశారు. కేపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే 2013లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినా సీఎం కాలేకపోయానన్నారు. తన నాయకత్వంలో పార్టీ ప్రగతివైపు సాగినా తనకు సహకరించినవారు లేరని పేర్కొన్నారు. తానెప్పుడూ ఆ విషయాలు బహిర్గతం చేసుకోలేనన్నారు. 2018లో కాంగ్రెస్‌ ఓటమికి దళితులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమే కారణమైందని తెలిపారు. దళిత సమాజాన్ని నిర్లక్ష్యం చేసినందుకు అగ్రనాయకులకు తగిన గుణపాఠం చెప్పినట్టయిందన్నారు. దళిత నేతలకు సీఎం పదవి నిరాకరించారన్నారు. తాను లేదా సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మహదేవప్ప, పౌర ఆహార సరఫరాల శాఖ మంత్రి కేహెచ్‌ మునియప్పలలో ఒకరు ఎందుకు ముఖ్యమంత్రి కారాదని ప్రశ్నించారు. మనమంతా కలసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడు పార్టీ కూడా ఆలోచిస్తుందని, రాష్ట్రంలో జరిగే పరిణామాలను జాగ్రత్తగా వ్యవహరిస్తారని తెలిపారు. ఇటీవలి ఎన్నికల్లో దళితులు, బీసీ వర్గాలు కాంగ్రె్‌సకు అండగా నిలిచారని పేర్కొన్నారు. రానున్న లోక్‌సభ, బీబీఎంపీ ఎన్నిల్లో ఓటు బ్యాంకును చేజార్చుకునేందుకు పార్టీ సిద్ధంగా లేదన్నారు. సిద్దరామయ్య, డీకే శివవకుమార్‌ మధ్య రాజీ కుదర్చడంలో కాంగ్రెస్‌ విజయవంతమైందన్నారు.

Updated Date - 2023-06-15T13:24:01+05:30 IST