New Parliament Building: పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం ఎలా జరుగనుందంటే..?

ABN , First Publish Date - 2023-05-26T12:06:08+05:30 IST

న్యూఢిల్లీ: భారతదేశ నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లా ఈనెల 28వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం రెండు దశలుగా ఉండబోతోంది. తొలుత పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు. రెండో భాగం రాజ్యసభ ఛాంబర్‌లో జాతీయగీతాలాపనతో మధ్యాహ్నం ప్రారంభమవుతుంది.

New Parliament Building: పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం ఎలా జరుగనుందంటే..?

న్యూఢిల్లీ: భారతదేశ నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లా (Om Birla) ఈనెల 28వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం రెండు దశలుగా (Two phases) ఉండబోతోంది. తొలుత పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఆ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులంతా లోక్‌సభ, రాజ్యసభ ప్రాంగణాలను పర్యవేక్షిస్తారు. కార్యక్రమంలోని రెండో భాగం రాజ్యసభ ఛాంబర్‌లో జాతీయగీతాలాపనతో మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. అయితే, అధికారికంగా మాత్రం ఈ వివరాలు ప్రకటించలేదు.

ఇనాగరేషన్ ఇలా..

-పార్లమెంటులోని మహాత్మాగాంధీ విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసే పందిరలో సంప్రదాయ పూజలు, హోమంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందులో ప్రధాని మోదీ, లో‌క్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, సీనియర్ మంత్రులు పాల్గొంటారు.

-పూజాకార్యక్రమాలు పూర్తికాగానే ఇందులో పాల్గొనే ప్రముఖులతా కలిసి లోక్‌సభ, రాజ్యసభ ప్రాంగణాలను పర్వేక్షిస్తారు. లోక్‌సభ ఛాంబర్‌లో స్పీకర్ కుర్చీ వద్ద పవిత్రమైన రాజదండాన్ని (సెంగాల్) ప్రతిష్ఠిస్తారు.

-తమిళనాడుకు చెందిన వేదపండితులు, ఒరిజినల్ సెంగాల్‌ను డిజైన్ చేసిన స్వర్ణకారులు పాల్గొని, పూజాదికాలు నిర్వహించిన అనంతరం ఈ రాజదండాన్ని అమర్చనున్నారు.

-ఉదయం 9.30 గంటల కల్లా తొలి విడత ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తవుతుంది. మధ్యాహ్నం రెండో విడత కార్యక్రమం మొదలవుతుంది.

-మధ్యాహ్న కార్యక్రమంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రసంగం ఉంటుంది. రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌కర్ తరఫున అభినందన సందేశాన్ని ఆయన చదివి వినిపిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లిఖితపూర్వక సందేశాన్ని కూడా ఇదే సందర్భంగా సభలో వినిపిస్తారు.

-ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని 75 రూపాయల నాణేన్ని, ఒక స్మారక తపాలా బిళ్లను ప్రధానమంత్రి విడుదల చేస్తారు. కార్యక్రమాన్ని ముగిస్తూ లోక్‌సభ సెక్రటరీ జనరల్ 'ఓట్ ఆఫ్ థాంక్స్' చెబుతారు.

-పార్లమెంటు భవనం ప్రధాన ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్, పారిశ్రమికవేత్త రతన్ టాటా, పలువురు సినీ, క్రీడా ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

-25 రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు ప్రకటించాయి. ఎన్డీయే భాగస్వామ్య పార్టీలైన అన్నాడీఎంకే, అప్నాదళ్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, శివసేన షిండే వర్గం, ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్‌ పార్టీలు ఇందులో పాలుపంచుకోనున్నాయి.

Updated Date - 2023-05-26T12:22:17+05:30 IST