Javed Akhtar: సీతారాముల గడ్డపై పుట్టినందుకు గర్విస్తున్నా: జావెద్ అక్తర్
ABN , First Publish Date - 2023-11-10T19:38:07+05:30 IST
బాలీవుడ్ ప్రముఖ కవి, సీనియర్ రచయిత జావెద్ అక్తర్ హిందూ కమ్యూనిటీపై ప్రశంసలు కురిపించారు. హిందువుల సంస్కతి, సంప్రదాయాల కారణంగానే భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ఉందని అన్నారు.
ముంబై: బాలీవుడ్ ప్రముఖ కవి, సీనియర్ రచయిత జావెద్ అక్తర్ (Javed Akhtar) హిందూ కమ్యూనిటీ (Hindu community)పై ప్రశంసలు కురిపించారు. హిందువుల సంస్కతి, సంప్రదాయాల కారణంగానే భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ఉందని అన్నారు. ముంబైలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే (Raj Thackeray) నిర్వహించిన దీపోత్సవ్ కార్యక్రమంలో మాట్లాడుతూ జావెద్ అక్తర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
హిందువులు ఉదారులు, విశాల హృదయులు
సమాజంలో పెరుగుతున్న అసహనంపై అక్తర్ ఆందోళన వ్యక్తం చేశారు. సహజంగానే ఎప్పుడూ కొందరు అసహనంతో ఉంటారని, అయితే ఒక కమ్యూనిటీగా హిందువులు ఉదారులని, విశాల హృదయం ఉన్నవారని, అది వారి గొప్ప గుణమని శ్లాఘించారు. ఆ గుణాన్ని కోల్పోవద్దని కోరారు. హిందువుల జీవన విధానాన్ని ఇండియన్లంతా నేర్చుకోవాలన్నారు. తాను నాస్తికుడనని జావెద్ అక్తర్ అంగీకరిస్తూనే, రాముడు, సీతాదేవి పుట్టిన గట్టిలో తాను పుట్టినందుకు గర్విస్తున్నానని అన్నారు. 'జై సియరాం' అంటూ నినాదాలు కూడా ఇచ్చారు.
షోలే ఇప్పుడు తీస్తే...
ఒకప్పటి బాలీవుడ్ సెన్సేషనల్ మూవీ 'షోలే'ని ప్రస్తావిస్తూ, ఇవాళ ఆ సినిమా తీస్తే హేమమాలిని, ధర్మేంద్ర గుడిలో డైలాగ్స్‌పై పెద్ద వివాదం వచ్చేదని అన్నారు.