Karnataka : ఐపీఎస్ అధికారి రూపకు ఐఏఎస్ అధికారి రోహిణి హెచ్చరిక... రూ.1 కోటి పరువు నష్టం దావా...

ABN , First Publish Date - 2023-02-23T16:08:50+05:30 IST

కర్ణాటకలో ఐఏఎస్ అధికారి రోహిణి సిందూరి (IAS officer Rohini Sindhuri), ఐపీఎస్ అధికారి డీ రూప మౌడ్గిల్ (IPS officer D Roopa) మధ్య

Karnataka : ఐపీఎస్ అధికారి రూపకు ఐఏఎస్ అధికారి రోహిణి హెచ్చరిక... రూ.1 కోటి పరువు నష్టం దావా...
Rohini Sindhuri, D Roopa

బెంగళూరు : కర్ణాటకలో ఐఏఎస్ అధికారి రోహిణి సిందూరి (IAS officer Rohini Sindhuri), ఐపీఎస్ అధికారి డీ రూప మౌడ్గిల్ (IPS officer D Roopa) మధ్య వివాదం మరింత ముదిరింది. తనపై తప్పుడు, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెట్టినందుకు 24 గంటల్లోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపడతానని రూపను రోహిణి హెచ్చరించారు. ఈ మేరకు రోహిణి ఓ లీగల్ నోటీసును రూపకు పంపించారు.

ఓ ఎమ్మెల్యేతో కలిసి సెటిల్మెంట్లు చేస్తూ, రోహిణి అవినీతికి పాల్పడ్డారని రూప ఆరోపించిన సంగతి తెలిసిందే. రోహిణి ఫొటోలను రూప ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. తన ఫొటోలను 2021, 2022 సంవత్సరాల్లో ముగ్గురు పురుష ఐఏఎస్ అధికారులకు రోహిణి పంపించినట్లు రూప ఆరోపించారు. తన ఫొటోలను పురుష ఐఏఎస్ అధికారులకు పంపించడం ద్వారా రోహిణి సర్వీస్ రూల్స్‌ను ఉల్లంఘించారని రూప ఆరోపించారు.

ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారి రోహిణి సిందూరి తన న్యాయవాది సీవీ నాగేశ్ ద్వారా లీగల్ నోటీసును రూపకు పంపించారు. ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవని, తన నడవడిక, స్వభావాలను తాకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల్లోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, తన పరువు, ప్రతిష్ఠలకు భంగం వాటిల్లేవిధంగా చేసిన ఈ ఆరోపణలు చేసినందుకు లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలన్నారు. లేని పక్షంలో రూ. 1 కోటి నష్టపరిహారం కోరుతూ క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

కర్ణాటక ప్రభుత్వం రూప, రోహిణిలను పోస్టింగ్ ఇవ్వకుండా, ఈ నెల 21న బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

Turkey and Syria : భూకంప బాధిత టర్కీ, సిరియాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కష్టాలు

AIADMK : ఏఐఏడీఎంకే చీఫ్ వివాదం... సుప్రీంకోర్టులో పన్నీర్‌సెల్వంకు షాక్...

Updated Date - 2023-02-23T16:08:54+05:30 IST