IIT Madra student Suicide: ఐఐటీ పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య, ఏడాదిలో ఇది మూడో ఘటన

ABN , First Publish Date - 2023-04-02T13:43:37+05:30 IST

మిళనాడులోని వేలాచేరిలో మరోసారి షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -మద్రాసులో..

IIT Madra student Suicide: ఐఐటీ పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య, ఏడాదిలో ఇది మూడో ఘటన

చెన్నై: తమిళనాడులోని వేలాచేరి (Velachery)లో మరోసారి షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-మద్రాసులో చదవుతున్న పీహెచ్‌డీ విద్యార్థి సచిన్ తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. మృతుడు పశ్చిమబెంగాల్ వాసి అని పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ఐఐటీ-మద్రాసులో ఆత్మహత్యా ఘటనలు చోటుచేసుకోవడం ఇది మూడోసారి కాగా, 2018 నుంచి 11 ఘటనలు జరిగాయి.

తాజా ఘటనపై పోలీసుల సమాచారం ప్రకారం, ఆత్మహత్యకు పాల్పడిన సచిన మార్చి 31న ''ఐయామ్ సారీ...అంత మంచిగా ఏమీ లేదు'' అంటూ వాట్సాప్ స్టాటస్ పోస్ట్ చేశాడు. దీంతో మిత్రులు అతని ఇంటికి చేరుకునే సరికి గదిలో ఉరి వేసుకుని కనిపించాడు. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అతను మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రాయపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

సంతాపం తెలిసిన ఐఐటీ యాజమాన్యం

కాగా, పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్మపై ఐఐటీ మద్రాసు ఒక ప్రకటనలో సంతాపం తెలిపింది. 31వ తేదీన తన నివాసంలో ఉరివేసుకుని పీహెచ్‌డీ రీసెర్చ్ స్కాలర్ మరణించడం తమను తీవ్ర ఆందోళనకు గురించేసిందని, అకడమిక్, రీసెర్చ్ రికార్డు ఉన్న ప్రతిభావంతుడైన విద్యార్థిని కోల్పోవడం తీరని లోటని పేర్కొంది. మృతుని మిత్రులు, కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపింది. ఇలాంటి క్లిష్ట సమయంలో విద్యార్థి కుటుంబ సభ్యుల ప్రైవసీని గౌరవించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొంది. అతని ఆత్మకు శాంతికలగాలని కోరకుంటున్నట్టు తెలిపింది.

కాగా, దీనికి ముందు మార్చి 14న బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థి ఒకరు మద్రాస్ ఐఐటీ క్యాంపస్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైపు పుష్కక్ శ్రీ సాయి (20)గా గుర్తించారు. ఫిబ్రవరి 14న మహారాష్ట్రకు చెందిన ఒక రీసెర్చ్ స్కాలర్ కూడా ఐఐటీ క్యాంపస్‌లోని ఒక గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

Updated Date - 2023-04-02T13:43:37+05:30 IST