I.N.D.I.A. Coordination Committee: హస్తినలో తొలి సమావేశం.. ఎజెండాలో లేని సీట్ల షేరింగ్ అంశం..!

ABN , First Publish Date - 2023-09-13T18:02:29+05:30 IST

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ఏర్పాటయిన విపక్ష ఇండియా (I.N.D.I.A.) కూటమికి చెందిన 14 మంది సభ్యుల సమన్వయ కమిటీ ఢిల్లీలో బుధవారం సాయంత్రం సమావేశమవుతోంది. సంకీర్ణ వ్యూహాలు, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించేందుకు సమన్వయ కమిటీ సభ్యులు ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో సమావేశమవుతున్నారు. సీట్ల షేరింగ్ అంశం ఇవాల్టి చర్చల్లో లేనట్టు తెలుస్తోంది.

I.N.D.I.A. Coordination Committee: హస్తినలో తొలి సమావేశం.. ఎజెండాలో లేని సీట్ల షేరింగ్ అంశం..!

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ఏర్పాటయిన విపక్ష ఇండియా (I.N.D.I.A.) కూటమికి చెందిన 14 మంది సభ్యుల సమన్వయ కమిటీ (Coordination committee) ఢిల్లీలో బుధవారం సాయంత్రం సమావేశమవుతోంది. సంకీర్ణ వ్యూహాలు, భవిష్యత్ కార్యక్రమాలు, సీట్ల షేరింగ్ అంశంపై చర్చించేందుకు సమన్వయ కమిటీ సభ్యులు ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో సమావేశమవుతున్నారు. డి.రాజా, జావెద్ అలి, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్, గురుదీప్ సింగ్ సప్పల్, టీఆర్ బాలు, తేజస్వి యాదవ్‌లు పవార్ నివాసానికి చేరుకున్నారు. ఈడీ సమన్ల కారణంగా టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ, కారణాంతరాల వల్ల జేడీయూ నేత లలన్ సింగ్ సైతం ఈ సమావేశానికి హాజరుకావడం లేదు.


కాగా, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బుధవారంనాటి సమన్వయ కమిటీ సమావేశంలో సీట్ల షేరింగ్ అంశం చర్చకు రాకపోవచ్చని తెలుస్తోంది. ఇటీవల ముంబైలో జరిగిన రెండ్రోజుల సమావేశంలో సమష్టిగా లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవాలని, ఇచ్చిపుచ్చుకునే స్ఫూర్తితో సీట్ల షేరింగ్‌ ఏర్పాట్లను సాధ్యమైనంత త్వరగా ఫైనలైజ్ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కూటమి పనితీరు, సంయుక్తంగా ర్యాలీలు నిర్వహించే అంశాలను సమన్యయ కమిటీ సమవేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.


సమన్వయ కమిటీ సభ్యులు వీరే..

'ఇండియా' కూటమి సమన్వయ కమిటీ సభ్యులలో శరద్ పవార్ (ఎన్‌సీపీ ), కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్), అభిషేక్ బెనర్జీ (టీఎంసీ), టీఆర్ బాలు (డీఎంకే), హేమంత్ సోరెన్ (జేఎంఎం), సంజయ్ రౌట్ (శివసేన-యూబీటీ), తేజస్వి యాదవ్ (ఆర్జేడీ), రాఘవ్ చద్దా (ఆప్), జావెద్ అలీ ఖాన్ (సమాజ్‌వాదీ పార్టీ), లలన్ సింగ్ (జేడీయూ), డి.రాజా (సీపీఐ), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తి (పీడీపీ), సీపీఎం నుంచి ఒకరు ఉన్నారు.

Updated Date - 2023-09-13T18:02:29+05:30 IST