Rajnath Singh: యూపీ డిఫెన్స్ కారిడార్‌లో బ్రహ్మోస్ క్షిపణలు, డ్రోన్ల తయారీ

ABN , First Publish Date - 2023-06-17T18:52:38+05:30 IST

ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ కేవలం నట్లు, బోల్టుల తయారీనే కాకుండా, బ్రహ్మోస్ క్షిపణలు, డ్రోన్లు , ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్స్‌లను కూడా తయారు చేస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. రక్షణ శాఖ ఎగుమతిదారుగా భారతదేశం త్వరలోనే ప్రపంచ పటంలోనే చోటు సంపాదించుకోనుందని చెప్పారు.

Rajnath Singh: యూపీ డిఫెన్స్ కారిడార్‌లో బ్రహ్మోస్ క్షిపణలు, డ్రోన్ల తయారీ

లక్నో: ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ (UPDIC)లో కేవలం నట్లు, బోల్టుల తయారీనే కాకుండా, బ్రహ్మోస్ క్షిపణలు (Brahmos missiles), డ్రోన్లు (Drones), ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్స్‌లను కూడా తయారు చేస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) తెలిపారు. రక్షణ శాఖ ఎగుమతిదారుగా భారతదేశం త్వరలోనే ప్రపంచ పటంలోనే చోటు సంపాదించుకోనుందని చెప్పారు. డిఫెన్స్ కారిడార్ ప్రాజెక్ట్ శరవేగంగా పూర్తి చేయడానికి కేంద్రం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. ఈ ప్రాజెక్టు కింద ఉత్తరప్రదేశ్, తమిళనాడులో డిఫెన్స్ కారిడార్లను అభివృద్ధి పరచనున్నట్టు తెలిపారు.

''యూపీ కారిడార్ విషయంలో కీలకమైన విషయం ఏమిటంటే అక్కడ కేవలం నట్లు, బోల్టులు, విడిభాగాల తయారీకే పరిమితం కాదు. డ్రోన్లు, యూఏవీలు, ఎలక్ట్రానిక్ వార్‌వేర్ (సిస్టమ్స్), ఎయిర్‌క్రాఫ్ట్, బ్రహ్మోస్ క్షిపణలు కూడా తయారవుతాయి. విడిభాగాల కూర్పు ఉంటుంది'' అని రాజ్‌నాథ్ తెలిపారు. లక్నోలో శనివారంనాడు జరిగిన ''ఆత్మనిర్భర్ భారత్'' కార్యక్రంలో ఆయన మాట్లాడుతూ, అంతరిక్ష, రక్షణ రంగాల్లో విదేశీ సరఫరాదులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ (యూపీడీఐసీ)ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని అన్నారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడులో డిఫెన్స్ కారిడార్ల ఏర్పాటు చేద్దాం అందుకు తగిన వాతావరణాన్ని ఏర్పరచనున్నట్టు చెప్పారు.

''ఈ కారిడార్‌ కోసం 1,700 హెక్టార్ల భూమిని సేకరించాలనే ప్లా్న్ ఉంది. ఇందులో 95 శాతం భూమిని ఇప్పటికే సేకరించాం. ఇందులో 36 పరిశ్రమలు, సంస్థలకు సుమారు 600 హెక్టార్ల భూమిని కేటాయించాం. రూ.16,000 కోట్ల విలువచేసే పెట్టుబడి విలువ కలిగిన 109 ఎంఓయూలపై సంతకాలు కూడా జరిగాయి'' అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్‌ను ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వైస్ ఇండస్ట్రియల్ డవలప్‌మెంట్ అథారిటీ (యూపీఈఐడీఏ) ఏర్పాటు చేస్తుండగా, ఇందులో ఆరు నోడల్ పాయింట్లు- ఆగ్రా, అలీగఢ్, చిత్రకూట్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో ఉంటాయి. తమిళనాడు డిఫెన్స్ కారిడార్‌లో చెన్నై, కోయింబత్తూరు, హోసూరు, సేలం, తిరుచపల్లి నోడల్ పాయింట్లుగా ఉంటాయి.

స్వయం సమృద్ధి అనేది ఆప్షన్ కాదు, అవసరం..

వేగంగా మారుతున్న ప్రపంచంలో స్వయం సమృద్ధి అనేది ఒక ఆప్షన్ కాదని, అవసరమని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రతి రంగంలోనూ స్వయం సమద్ధి సాధించాలని తమ ప్రభుత్వం కోరుకుంటోందని, ముఖ్యంగా దేశ భద్రతకు సంబంధిచిన అంశమైన రక్షణరంగం చాలా కీలకంగా భావిస్తోందని చెప్పారు. 1971 యుద్ధంలో మనకు ఆయుధ సామగ్రి అవసరం ఏర్పడినప్పుడు చాలా మంది నిరాకరించారని, దాంతో ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవలసి వచ్చిందని, మన విజ్ఞప్తిని తోసిపుచ్చిన దేశాల పేర్లు తాను వెల్లడించదలచుకోలేదని చెప్పారు. 1999లో కార్గిల్ యుద్ధం సమయంలోనూ ఇదే కథా పునరావృతమైందని చెప్పారు. కార్గిల్ యుద్ధం సమయంలో మన సాయుధ బలగాలు ఆయుధాల కొరతను చవిచూడాల్సి వచ్చిందని, అప్పుడు కొన్ని దేశాలు శాంతి పాఠాలు మనకు నేర్పించాలని చూశాయని అన్నారు. సంప్రదాయకంగా మనకు ఆయుధాలు సరఫరా చేసే దేశాలు కూడా నిరాకరించాయని ఆయన గుర్తుచేశారు. ఆయా కారణాల రీత్యా మనంతగా మనం బలం బలపడటమే తప్ప మరో మార్గం లేదని తాము గ్రహించామని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

Updated Date - 2023-06-17T18:58:46+05:30 IST