Breaking News:రాజస్థాన్‌లో కూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిగ్-21 విమానం...నలుగురి మృతి
ABN , First Publish Date - 2023-05-08T11:10:09+05:30 IST
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిగ్-21 విమానం సోమవారం రాజస్థాన్ రాష్ట్రంలోని హనుమాన్ ఘడ్ జిల్లాలో కుప్పకూలిపోయింది...
జైపూర్ (రాజస్థాన్): ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిగ్-21 విమానం సోమవారం రాజస్థాన్ రాష్ట్రంలోని హనుమాన్ ఘడ్ జిల్లాలో కుప్పకూలిపోయింది.(Rajasthan)ఈ ప్రమాదం నుంచి ఎయిర్ ఫోర్స్ మిగ్-21 విమాన పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. పైలట్ పారాచూట్ సహాయంతో కిందకు దూకటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విమానం కూలిన ఘటనలో స్థానికులు నలుగురు మరణించారు.పలువురు గాయపడ్డారు. విమానం గ్రామ శివారులోని ఓ ఇంటిపై కూలడంతో నలుగురు పౌరులు మరణించారు. ఎయిర్ ఫోర్స్ విమానం కూలిన ప్ర్రాంతానికి ఆర్మీ హెలికాప్టర్(Indian Air Force MiG-21 aircraft) వచ్చి సహాయ చర్యలు చేపట్టింది. ఈ మిగ్ విమానం సూరత్ ఘడ్ నుంచి బయలుదేరి ప్రమాదానికి గురైంది.(crash) గత జనవరి నెలలో రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ లో రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ సుఖోయ్ 30 మిరాజ్ 2000 విమానాలు కూలిన ఘటనలో ఓ పైలట్ మరణించారు.
ఇది కూడా చదవండి : Amritsar : స్వర్ణ దేవాలయం పరిసరాల్లో రెండవ పేలుడు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మోరీనాలో ఓ విమానం గతంలో కూలింది. గత వారం జమ్మూకశ్మీరులోని కిష్టావర్ లో ఆర్మీ హెలికాప్టర్ కూలింది. కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో గత నెలలో కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ కూలింది. గత ఏడాది అక్టోబరులో రెండు ఆర్మీ హెలికాప్టర్లు కూలాయి. గత ఏడాది అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ ప్రాంతంలో చీతా హెలికాప్టర్ కూలి ఇండియన్ ఆర్మీ పైలట్ మరణించారు. గతంలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానాలు, హెలికాప్టర్లు కూలిన ఘటనల్లో మన సైనికులు మృత్యువాతపడ్డారు.