Israel-Hamas war: యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ప్రధాని మోదీ
ABN , First Publish Date - 2023-11-03T20:07:28+05:30 IST
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్రమైన నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్ ధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారంనాడు ఫోన్ చేశారు. యుద్ధంపై మధ్య ప్రాశ్చ దేశాల ఆందోళనను ప్రధాని ప్రస్తావించారు.
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్రమైన నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్ (UAE) అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (Mohammed Bin Zayed Al Nahyan)కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శుక్రవారంనాడు ఫోన్ చేశారు. యుద్ధంపై మధ్య ప్రాశ్చ దేశాల ఆందోళనను ప్రధాని ప్రస్తావించారు. గాజాలో భద్రత, మానవతా పరిస్థితిపై సత్వర పరిష్కారం కనుగొనవలసిన అవసరం ఉందని ఇరుదేశాల నేతలు తమ సంభాషణల్లో ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. యూపీఏ అధ్యక్షుడితో ఫోనులో మాట్లాడిన విషయాన్ని మోదీ ఒక ట్వీట్‌లో తెలియజేశారు.
గాజాలో భద్రత, మానవాతా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రాంతీయ శాంతి, భద్రత, సుస్థిరత కోసం సత్వర పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని తాము ఉభయులు అభిప్రాయపడినట్టు మోదీ ఆ ట్వీట్‌లో తెలిపారు. ఘర్షణల సత్వర పరిష్కారం వల్ల ప్రతి ఒక్కరికీ ప్రయోజనం ఉంటుందని యూఏఈ అధ్యక్షుడికి మోదీ సూచించారు. ఈ విషయంపై మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్నాన్ సైతం ఏకీభవించారని మోదీ వెల్లడించారు.