Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ అయ్యాక ఇస్రో మాజీ చీఫ్ కే.శివన్ అమితానందం.. ఆ సంతోషంలో...

ABN , First Publish Date - 2023-08-24T18:20:49+05:30 IST

చంద్రయాన్-3 మిషన్‌లో (Chandrayaan) భాగంగా విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) బుధవారం సాయంత్రం జాబిల్లిపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండ్ అయ్యాక యావత్ భారతం ఉప్పొంగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ వేడుకలా సంబరపడ్డారు. మరి చంద్రయాన్-2 విఫలమైనప్పుడు ప్రధాని మోదీ ముందు కన్నీళ్లు పెట్టుకున్న ఇస్రో మాజీ చైర్మన్ కే శివన్ (K Sivan) ఇంకెంత ఆనందించి ఉంటారో ప్రత్యేకంగా చెప్పాలా!.

Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ అయ్యాక ఇస్రో మాజీ చీఫ్ కే.శివన్ అమితానందం.. ఆ సంతోషంలో...

న్యూఢిల్లీ: చంద్రయాన్-3 మిషన్‌లో (Chandrayaan) భాగంగా విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) బుధవారం సాయంత్రం జాబిల్లిపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండ్ అయ్యాక యావత్ భారతం ఉప్పొంగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ వేడుకలా సంబరపడ్డారు. మరి చంద్రయాన్-2 విఫలమైనప్పుడు ప్రధాని మోదీ ముందు కన్నీళ్లు పెట్టుకున్న ఇస్రో మాజీ చైర్మన్ కే శివన్ (K Sivan) ఇంకెంత ఆనందించి ఉంటారో ప్రత్యేకంగా చెప్పాలా!. ఆనందంతో ఉప్పొంగిపోయారు. గర్వంగా భావించారు. చంద్రయాన్-3 అద్భుత విజయంపై గురువారం ఓ జాతీయ మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.


చంద్రయాన్-3 మిషన్ ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండవ్వడంపై కే శివన్ హర్షం వ్యక్తం చేశారు. బెంగళూరులోని ఇస్రో కంట్రోల్ రూమ్‌లో అమితానందానికి గురయ్యానని వెల్లడించారు.

‘‘ మొత్తానికి మన ప్రార్థనలు నిజమయ్యాయి. ల్యాండింగ్ జరిగిన తర్వాత మేము ఇంటికి వెళ్లలేదు. ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చేవరకు కంట్రోల్ రూమ్‌లోనే కూర్చొని ఉన్నాం. చంద్రుడి ఉపరితలంపై రోవర్ కదిలిన తర్వాత మాత్రమే అక్కడి వెళ్లిపోయాను. ఇంటికి చాలా ఆలస్యంగా చేరుకున్నాను’’ అని శివన్ తన సంతోషాన్ని పంచుకున్నారు. ‘‘ ఈ విజయం కోసం నేను నాలుగేళ్లు నిరీక్షించాను. ఈ విజయం మనందరికీ, యావత్ భారతావనికి ఎంతో తియ్యటివార్త’’ అని శివన్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-08-24T18:20:49+05:30 IST