Chandrayaan-3 : చంద్రునిపై రాత్రి కావొస్తోంది.. విక్రమ్, ప్రజ్ఞాన్‌లను జోకొట్టేందుకు ఇస్రో సన్నాహాలు..
ABN , First Publish Date - 2023-09-02T14:20:44+05:30 IST
చంద్రునిపై రాత్రి వేళ సమీపిస్తోంది. భూమిపై 14 రోజులకు సమానమైన చంద్రునిపై ఒక పగటి పూట పూర్తి కాబోతోంది. అందుకే చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను నిద్రపుచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) సన్నాహాలు చేస్తోంది.
న్యూఢిల్లీ : చంద్రునిపై రాత్రి వేళ సమీపిస్తోంది. భూమిపై 14 రోజులకు సమానమైన చంద్రునిపై ఒక పగటి పూట పూర్తి కాబోతోంది. అందుకే చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను నిద్రపుచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) సన్నాహాలు చేస్తోంది. వీటికి నిర్దేశించిన గడువు పూర్తి కాబోతుండటంతో వీటిని స్లీప్ మోడ్‌లోకి పంపించబోతోంది.
ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీహరి కోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఆదిత్య ఎల్1ను శనివారం విజయవంతంగా ప్రయోగించిన అనంతరం ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ (ISRO Chief S Somanath) తెలిపిన వివరాల ప్రకారం, చంద్రయాన్-3 మిషన్‌కు నిర్దేశించిన గడువు పూర్తి కాబోతోంది. చంద్రునిపై పగటి సమయం ముగియబోతోంది. చంద్రునిపై ఒక పగటి సమయం భూమిపై 14 రోజులకు సమానం. చంద్రునిపై రాత్రి సమయంలో ఉష్ణోగ్రత మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను స్లీప్ మోడ్‌లోకి పంపించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది.
విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటికీ పని చేసే స్థితిలోనే ఉన్నాయి. ఇవి చంద్రునిపై రాత్రి సమయాన్ని తట్టుకుని నిలవవలసిన అవసరం ఉంది కాబట్టి, వీటిని స్లీప్ మోడ్‌లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఒకటి, రెండు రోజుల్లో వీటిని స్లీప్ మోడ్‌లోకి తీసుకెళ్తారు. ప్రజ్ఞాన్ రోవర్ విక్రమ్ ల్యాండర్ నుంచి సుమారు 101.4 మీటర్ల దూరం వరకు వెళ్లింది.
ఇవి కూడా చదవండి :
Supreme Court : తల్లిదండుల పెళ్లి చెల్లకపోయినా పిల్లలకు వారసత్వ హక్కు ఉంటుంది : సుప్రీంకోర్టు
RSS : మన దేశాన్ని ‘భారత్’ అని పిలవాలి : మోహన్ భగవత్