One Lakh Fine: ప్యాకెట్‌లో ఒక బిస్కెట్ తక్కువ ఉందని.. రూ.లక్ష జరిమానా వేసిన కోర్టు
ABN , First Publish Date - 2023-09-06T14:00:04+05:30 IST
చెన్నైలోని ఎంఎండీఏ మాథుర్ ప్రాంతానికి చెందిన పి.ఢిల్లీబాబు అనే వ్యక్తి 2021, డిసెంబర్ నెలలో స్థానికంగా ఉండే ఓ రిటైల్ షాప్ నుంచి రెండు ప్యాకెట్ల సన్‌ఫీస్ట్ మేరీ లైట్ బిస్కెట్లను కొనుగోలు చేశాడు. అయితే ఒక ప్యాకెట్‌లో 16 బిస్కెట్లకు బదులు 15 బిస్కెట్లు మాత్రమే కనిపించాయి. తనను ఎందుకు మోసం చేశారంటూ షాపు యజమానిని ప్రశ్నించాడు. అతడి నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఐటీసీ లిమిటెడ్‌ను మెయిల్ ద్వారా సంప్రదించాడు. అక్కడి నుంచి కూడా వినియోగదారుడికి సరైన సమాధానం రాలేదు. దీంతో ఏకంగా వినియోగదారుల ఫోరం కోర్టులో ఫిర్యాదు చేశాడు.
సాధారణంగా సన్‌ఫీస్ట్ బిస్కెట్ ప్యాకెట్‌లో ఎన్ని బిస్కెట్లు ఉంటాయో మీకు తెలుసా.. ఎప్పుడైనా బిస్కెట్ ప్యాకెట్ కొని వాటిలో ఎన్ని ఉంటాయో లెక్కపెట్టారా.. కనీసం ప్యాకెట్‌పై బిస్కెట్ల సంఖ్య, తయారుచేసిన డేట్ గమనించారా.. అంటే చాలామంది లేదు అనే సమాధానం మాత్రమే ఇస్తారు. కానీ ఓ వినియోగదారుడు తాను కొనుగోలు చేసిన ఓ బిస్కెట్ ప్యాకెట్‌ను మొత్తం గమనించాడు. దీంతో రేపర్‌పై రాసిన బిస్కెట్ల సంఖ్య ప్రకారం ప్యాకెట్‌లో ఉన్న బిస్కెట్లలో ఒకటి తక్కువగా ఉందని ఏకంగా ఆ బిస్కెట్ ప్యాకెట్ తయారుచేసిన కంపెనీపై ఎఫ్ఎంసీజీ కోర్టులో కేసు పెట్టాడు. దీంతో ఈ కేసును విచారించిన వినియోగదారుల ఫోరం కోర్టు కంపెనీకి రూ.లక్ష జరిమానా విధించింది.
చెన్నైలోని ఎంఎండీఏ మాథుర్ ప్రాంతానికి చెందిన పి.ఢిల్లీబాబు అనే వ్యక్తి 2021, డిసెంబర్ నెలలో స్థానికంగా ఉండే ఓ రిటైల్ షాప్ నుంచి రెండు ప్యాకెట్ల సన్‌ఫీస్ట్ మేరీ లైట్ బిస్కెట్లను కొనుగోలు చేశాడు. అయితే ఒక ప్యాకెట్‌లో 16 బిస్కెట్లకు బదులు 15 బిస్కెట్లు మాత్రమే కనిపించాయి. తనను ఎందుకు మోసం చేశారంటూ షాపు యజమానిని ప్రశ్నించాడు. అతడి నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఐటీసీ లిమిటెడ్‌ను మెయిల్ ద్వారా సంప్రదించాడు. అక్కడి నుంచి కూడా వినియోగదారుడికి సరైన సమాధానం రాలేదు. దీంతో ఏకంగా వినియోగదారుల ఫోరం కోర్టులో ఫిర్యాదు చేశాడు. 76 గ్రాములు ఉండాల్సిన ప్యాకెట్ 74 గ్రాములు మాత్రమే ఉందని తెలిపాడు.
ఇది కూడా చదవండి: Bharat : దేశం పేరు మార్పు మొదలైనది చంద్రయాన్-3కి ముందే!
అటు ఐటీసీ రోజుకు సుమారు 50 లక్షల బిస్కెట్ ప్యాకెట్లను తయారుచేస్తోందని.. ఒక ప్యాకెట్‌లో ఒక బిస్కెట్ తక్కువ పెట్టడం ద్వారా ఐటీసీ వినియోగదారులను మోసం చేస్తోందని ఢిల్లీబాబు ఆరోపించాడు. ఒక్కో బిస్కెట్ 75 పైసలు ఉంటుందని.. ఈ లెక్కన రోజుకు రూ.29 లక్షల మోసం జరుగుతోందని అతడు కోర్టుకు వివరించాడు. అయితే ఈ వాదనను ఐటీసీ ఖండించింది. బరువు ఆధారంగానే తాము బిస్కెట్ ప్యాకెట్లను తయారుచేస్తామని.. కావాలని జరిగిన తప్పు కాదని ఐటీసీ వివరణ ఇచ్చింది. కానీ వినియోగదారుడి ఆరోపణతో సంతృప్తి చెందిన కోర్టు చివరకు ఐటీసీ కంపెనీకి రూ.లక్ష జరిమానా విధించింది. నిర్ధిష్ట బ్యాచ్‌లో తక్కువ బిస్కెట్లు ఉన్న ప్యాకెట్ల విక్రయాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది.