JN1 variant: రాష్ట్రంలో నాలుగు జేఎన్1 వేరియంట్ కేసులు
ABN , Publish Date - Dec 28 , 2023 | 07:55 AM
రాష్ట్రానికి చెందిన నలుగురు వ్యక్తులకు కరోనా వైరస్(Corona virus) కొత్త సబ్ వేరియంట్ జేఎన్.1 సోకినట్టు కేంద్ర వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
అడయార్(చెన్నై): రాష్ట్రానికి చెందిన నలుగురు వ్యక్తులకు కరోనా వైరస్(Corona virus) కొత్త సబ్ వేరియంట్ జేఎన్.1 సోకినట్టు కేంద్ర వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేరళ, గోవా, మహారాష్ట్ర, కర్నాటక(Kerala, Goa, Maharashtra, Karnataka) రాష్ట్రాల్లో ఈ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన నలుగురికి ఈ వైరస్ సోకినట్టు అనుమానించిన వైద్యాధికారులు వారి నుంచి శాంపిల్స్ సేకరించి పూణెలోని పరిశోధనాశాలకు పంపించారు. ఇక్కడ నిర్వహించిన పరిశోధనల్లో కోయంబత్తూరు, మదురై, తిరువళ్ళూరు, తిరుచ్చి జిల్లాలకు చెందిన నలుగురు వ్యక్తులకే కొత్త సబ్ వేరియంట్ జేఎన్.1 వైరస్ సోకినట్టు తేలిందని నిర్థారించారు. ఈ బాధితులను ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.