Karnataka Elections: బీజేపీ మేనిఫెస్టో సిద్ధం..ఆ మూడే కీలకం..!

ABN , First Publish Date - 2023-04-30T18:59:30+05:30 IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో ను భారతీయ జనతా పార్టీ సిద్ధం..

Karnataka Elections: బీజేపీ మేనిఫెస్టో సిద్ధం..ఆ మూడే కీలకం..!

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) మేనిఫెస్టో (Manifesto)ను భారతీయ జనతా పార్టీ (BJP) సిద్ధం చేసింది. ఈ మేనిఫెస్టోను మే 1వ తేదీ సోమవారంనాడు విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప సమక్షంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.

బీజేపీ మేనిఫెస్టోలో యువజన సంక్షేమ చర్యలు, మౌలిక వసతుల కల్పన, మహిళా సాధికారతపై ప్రధానంగా దృష్టి సారించినట్టు పార్టీ వర్గాల సమాచారం. తొలిసారి ఓటింగ్‌కు పాల్గొంటున్న 12వ తరగతి పాసైన విద్యార్థినీ విద్యార్థుల కోసం మేనిఫెస్టోలో ఒక ప్రత్యేక ప్రకటన ఉంటుందని అంటున్నారు. బీజేపీ 2018 మేనిఫెస్టోలో అన్ని వర్గాల వారిని కలుపుకొని వెళ్లింది. గోసంరక్షణ చర్యలను కూడా అందులో చేర్చింది.

కాగా, ఈసారి కర్ణాటకలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు పట్టుదలగా ఉన్న రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకులను, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఎన్నికల ప్రచారంలో మోహరించింది. తుది విడత ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శని, ఆదివారాల్లో కర్ణాటకలో వరుస ర్యాలీలు, రోడ్‌షోలలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలన్నా, అస్థిర ప్రభుత్వం ఏర్పడకూడదన్నా బీజేపీని గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, మే 13న ఫలితాలు వెల్లడవుతాయి.

Updated Date - 2023-04-30T18:59:30+05:30 IST