Karnataka BJP Manifesto: మేనిఫెస్టోలో కన్నడ ప్రజలపై బీజేపీ వరాల జల్లు.. సంవత్సరానికి మూడు ఫ్రీ..!

ABN , First Publish Date - 2023-05-01T12:03:30+05:30 IST

కర్ణాటక శాసన సభ ఎన్నికల కోసం మేనిఫెస్టోను భారతీయ జనతా పార్టీ (BJP) సోమవారం విడుదల చేసింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్

Karnataka BJP Manifesto: మేనిఫెస్టోలో కన్నడ ప్రజలపై బీజేపీ వరాల జల్లు.. సంవత్సరానికి మూడు ఫ్రీ..!
Karnataka BJP Election Manifesto release

బెంగళూరు : కర్ణాటక శాసన సభ ఎన్నికల కోసం మేనిఫెస్టోను భారతీయ జనతా పార్టీ (BJP) సోమవారం విడుదల చేసింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ (Basavaraj Bommai), సీనియర్ నేత బీఎస్ యెడియూరప్ప (BS Yediyurappa) సమక్షంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ‘ప్రజా ధ్వని’ పేరుతో ఈ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు.

మేనిఫెస్టో విడుదల తర్వాత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ మీడియాతో మాట్లాడుతూ, ఇది ప్రజల ఎన్నికల ప్రణాళిక అని చెప్పారు. కర్ణాటక ఏ విధంగా పరిపాలించబడుతుందో తెలిపే రోడ్‌మ్యాప్ అని తెలిపారు. ఈ మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను వివరించారు. నిరుపేదలకు మూడు వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఉగాది, వినాయక చవితి, దీపావళి పండుగలకు ఈ సిలిండర్లను ఇస్తామన్నారు. అణగారిన వర్గాలకు చెందిన కుటుంబాలకు రోజుకు అర లీటరు చొప్పున నందిని పాలను ఉచితంగా ఇస్తామన్నారు. ప్రతి వార్డులోనూ అటల్ ఆహార్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి’ని తాము విశ్వసిస్తున్నామని, వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు. రైతులకు రూ.5 లక్షల వరకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు.

బీజేపీ ‘ప్రజా ధ్వని’ ఎన్నికల ప్రణాళిక ముఖ్యాంశాలు :

- ఉమ్మడి పౌర స్మృతి అమలు

- రైతులకు రూ.5 లక్షల వరకు సున్నా వడ్డీకే రుణాలు

- కర్ణాటకలో ఎన్ఆర్‌సీ (జాతీయ పౌరుల రిజిస్టర్) అమలు

- రాడికలైజేషన్‌కు వ్యతిరేకంగా పోరాటం

- ఛాందసవాదానికి వ్యతిరేకంగా ప్రత్యేక విభాగం ఏర్పాటు

- బెంగళూరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

- బెంగళూరులోని అపార్ట్‌మెంట్‌వాసులు ఆనందంగా జీవించడం కోసం ప్రత్యేక పథకం

- కర్ణాటక అపార్ట్‌మెంట్ ఓనర్‌షిప్ యాక్ట్, 1972 సవరణ, కర్ణాటక రెసిడెంట్స్ వెల్ఫేర్ కన్సల్టేటివ్ కమిటీ ఏర్పాటు

- పోషణ పథకం క్రింద నిరుపేద కుటుంబాలకు ప్రతి రోజూ ఉచితంగా అర లీటరు చొప్పున నందిని పాల పంపిణీ

- ప్రతి నెలా రేషన్ కిట్స్.. 5 కేజీల శ్రీ అన్న-సిరి ధాన్య పంపిణీ

- చట్టవిరుద్ధ వలసదారులను పంపించేయడం

- ప్రతి పురపాలక సంఘంలోని ప్రతి వార్డులోనూ అటల్ ఆహార కేంద్రాల ఏర్పాటు, నాణ్యమైన, ఆరోగ్యకరమైన, సరసమైన ధరల్లో ఆహారాన్ని అందుబాటులో ఉంచడం

- ప్రభుత్వ పాఠశాలలను అత్యున్నత స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దడం కోసం ప్రముఖులతో భాగస్వామ్యం.

- ప్రతిభావంతులైన యువ ప్రొఫెషనల్స్‌కు ప్రోత్సాహం. ‘సమన్వయ’ పథకం ద్వారా చిన్న తరహా పరిశ్రమలు, ఐటీఐల మధ్య సహకారాన్ని పెంపొందించడం

- ఐఏఎస్, కేఏఎస్, బ్యాంకింగ్, ప్రభుత్వోద్యోగాలకు శిక్షణ పొందే విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం

- ‘మిషన్ స్వాస్థ్య కర్ణాటక’ పథకం ద్వారా ప్రజారోగ్య మౌలిక సదుపాయాల బలోపేతం

- పురపాలక సంఘాల్లో ప్రతి వార్డులో నమ్మ క్లినిక్‌ల ఏర్పాటు

- సీనియర్ సిటిజన్లకు ఉచితంగా ప్రతి సంవత్సరం మాస్టర్ హెల్త్ చెక్-అప్

- ‘స్టేట్ కేపిటల్ రీజియన్’గా రాబోయే తరాల కోసం బెంగళూరు అభివృద్ధి

- ఎలక్ట్రిక్ వాహనాల ప్రీమియర్ హబ్‌గా కర్ణాటక అభివృద్ధి

- రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, 1,000 స్టార్టప్ కంపెనీలకు మద్దతు, బీఎంటీసీ బస్సులను పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడం

- బెంగళూరు శివారులో ‘ఈవీ సిటీ’ నిర్మాణం

- ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు, ఏపీఎంసీల ఆధునికీకరణ, డిజిటైజేషన్, మైక్రో కోల్డ్ స్టోరేజ్ కేంద్రాల ఏర్పాటు కోసం రూ.30 వేల కోట్లతో కే-అగ్రి ఫండ్ ఏర్పాటు.

- నూతనంగా 5 ఆగ్రో-ఇండస్ట్రీ క్లస్టర్స్ ఏర్పాటు, కొత్తగా మూడు ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటు

- కర్ణాటకను అత్యంత ఆకర్షణీయమైన టూరిస్ట్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దేందుకు రూ.1500 కోట్లు కేటాయింపు

- కల్యాణ సర్క్యూట్, బనవాసి సర్క్యూట్, పరశురామ సర్క్యూట్, కావేరీ సర్క్యూట్, గాణగాపుర కారిడార్‌ల అభివృద్ధి

- ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం విస్తరణ

- ‘బియాండ్ బెంగళూరు’లో 10 లక్షల మాన్యుఫ్యాక్చరింగ్ ఉద్యోగాల సృష్టి

- ఇళ్లు లేని నిరుపేదల కోసం 10 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ

- ‘ఒనకే ఒబవ్వ సామాజిక న్యాయ నిధి’ పథకం క్రింద ఎస్సీ, ఎస్టీ మహిళలు ఐదేళ్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే, దానికి అదనంగా మ్యాచింగ్ డిపాజిట్ రూ.10,000 ప్రభుత్వం చేస్తుంది.

ఇవి కూడా చదవండి :

రైతు సమస్యలపై దేశవ్యాప్త పోరాటం: ఎస్కేఎం

LPG cylinder prices : భారీగా తగ్గిన వంటగ్యాస్ ధరలు

Updated Date - 2023-05-01T12:27:31+05:30 IST