Karnataka Cabinet Expansion: కర్ణాటక క్యాబినెట్ విస్తరణ.. మంత్రులుగా 24 మంది ప్రమాణస్వీకారం

ABN , First Publish Date - 2023-05-27T13:09:00+05:30 IST

కర్ణాటకలోని సిద్ధరామయ్య మంత్రివర్గంలోకి కొత్తగా మరో 24 మంది మంత్రులు వచ్చి చేరారు. వారం రోజుల క్రితం సీఎంగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్, మరో 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. శనివారంనాడు మరోసారి మంత్రివర్గ విస్తరణ జరగడంతో 24 మంది ఎమ్మెల్యేలు క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో కర్ణాటక మంత్రివర్గం పూర్తి స్థాయికి చేరింది.

Karnataka Cabinet Expansion:  కర్ణాటక క్యాబినెట్ విస్తరణ.. మంత్రులుగా 24 మంది ప్రమాణస్వీకారం

బెంగళూరు: కర్ణాటకలోని సిద్ధరామయ్య (Siddaramaiah) మంత్రివర్గంలోకి కొత్తగా మరో 24 మంది మంత్రులు వచ్చి చేరారు. వారం రోజుల క్రితం సీఎంగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్, మరో 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. శనివారంనాడు మరోసారి మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) జరగడంతో 24 మంది ఎమ్మెల్యేలు క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో కర్ణాటక మంత్రివర్గం పూర్తి స్థాయికి చేరింది. కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న 24 మందితో గవర్నర్‌ థావర్ చంద్ గెహ్లాట్ ప్రమాణస్వీకారం చేయించారు.

కొత్త మంత్రులు వీరే...

కర్ణాటక మంత్రులుగా కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో దినేష్ గుండురావు, కృష్ణ బైరేగౌడ, ఈశ్వర్ ఖండ్రే, రహీంఖాన్, సంతోష్ లాడ్, కెఎన్ రాజనన్న, కె.వెకటేష్, హెచ్‌సి మహదేవప్ప, బైరతి సురేష్, శివరాజ్ తంగడి, ఆర్‌బి తిమ్మాపూర్, బి.నాగేంద్ర, లక్షి, హెబ్బాల్కర్, మందు బంగారప్ప, డి.సుధాకర్, చెలువరాయ స్వామి, మంకుల్ వైద్య, ఎమ్‌సి సుధాకర్, హెచ్‌కే పాటిల్, శరణ్ ప్రకాష్ పాటిల్, శివానంద్ పాటిల్, ఎస్ఎస్ మల్లికార్జున, శరమ్ బసప్ప దర్శనపుర, ఎమ్మెల్సీ ఎస్ఎస్ బోసరాజు ఉన్నారు.

సిద్ధరామయ్య కొత్తగా తన మంత్రివర్గంలోకి తీసుకున్న వారిలో ఆరుగురు లింగాయల్ సామాజిక వర్గానికి చెందిన వారుండగా, నలుగురు వొక్కలిగ సామాజిక వర్గం, ముగ్గురు ఎస్‌సీలు, ఇద్దరు ఎస్‌టీలు, ఐదుగురు బీసీలు ఉన్నారు. ముస్లిం, జైన్, బ్రాహ్మణ, రెడ్డి సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి చోటు కల్పించారు. క్యాబినెట్‌లో ఒక మహిళకు చోటు దక్కింది.

Updated Date - 2023-05-27T14:40:47+05:30 IST