Karnataka: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసిన సిద్ధూ, డీకే
ABN , First Publish Date - 2023-05-22T16:08:57+05:30 IST
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్‌వీ దేశ్‌పాండే చేత గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ సోమవారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ల చేత అసెంబ్లీ సభ్యులుగా ప్రొటెం స్పీకర్ దేశ్‌పాండే ప్రమాణస్వీకారం చేయించారు.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్‌వీ దేశ్‌పాండే (RV Deshpande) చేత గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ సోమవారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ల చేత అసెంబ్లీ సభ్యులుగా ప్రొటెం స్పీకర్ దేశ్‌పాండే ప్రమాణస్వీకారం చేయించారు. ఈనెల 24వ తేదీ వరకూ ఈ సమావేశాలు జరుగనున్నాయి.
దీనికి ముందు సిద్ధరామయ్య మాట్లాడుతూ, సోమ, మంగళ, బుధవారాల్లో అసెంబ్లీ సమావేశలకు నిర్ణయించామని, కొత్త అసెంబ్లీ సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెప్పారు. ఇదే అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి స్పీకర్‌ను ఎన్నుకుంటామని తెలిపారు. 16వ అసెంబ్లీకి ఎన్నికైన 224 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశాల్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా గత శనివారంనాడు సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు డిప్యూటీ స్పీకర్‌గా డీకే శివకుమార్, మరో 8 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లతో పూర్తి ఆధిక్యం సాధించగా, బీజేపీ 66 సీట్లు, జనతాదళ్ (సెక్యులర్) 19 సీట్లు గెలుచుకున్నాయి.