Karnataka Results: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రీకూతుళ్లు, తండ్రీకొడుకుల హవా

ABN , First Publish Date - 2023-05-13T19:00:20+05:30 IST

కాగా ఈ ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు తమ కొడుకులు, కూతుళ్లతో కలిసి పోటీ చేసి విజయం సాధించి..

Karnataka Results: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రీకూతుళ్లు, తండ్రీకొడుకుల హవా

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) ఘన విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంది. కాగా ఈ ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు తమ పిల్లలతో కలిసి పోటీ చేసి విజయం సాధించి సంచలనం సృష్టించారు. మరోవైపు లింగాయత్ సీనియర్ నాయకుడు షామనూరు శివశంకరప్ప 92 యేళ్ల వయసులో మరోసారి జయకేతనం ఎగరవేశారు.

దావణగెరె జిల్లాలో బలమైన లింగాయత్ నేత శివశంకరప్ప దావణగెరె సౌత్(Davangere South) నుంచి గెలుపొందగా, దావణగెరె నార్త్ (Davangere North) నుంచి ఆయన కుమారుడు ఎస్‌ఎస్ మల్లికార్జున విజయం సాధించారు. మల్లికార్జున 78,345 ఓట్లతో గెలుపొందగా, మరోవైపు దక్షిణాదిలో తండ్రి శామనూరు శివశంకరప్ప(Shivshankarappa) 83,839 ఓట్లు సాధించి అఖండ విజయం సాధించారు.

బెంగళూరు(Bengaluru)లోని విజయనగర్‌ నియోజకవర్గం(VijayNagar Constituency)నుంచి కృష్ణప్ప గెలుపొందగా, రాజానగర్‌(Rajaji Nagar Constituency)లో ఆయన కుమారుడు ప్రియకృష్ణ గోవింద విజయం సాధించారు.

దేవనహళ్లి(Devanahalli) నియోజకవర్గంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేహెచ్‌ మునియప్ప(KH Muniappa) గెలుపొందగా, కేజీఎఫ్‌(KGF) నియోజకవర్గంలో ఆయన కుమార్తె రూపా కళాశశిధర్‌ విజయం సాధించారు. బెంగళూరు అర్బన్ జిల్లాలోని బీటీఎం లేఅవుట్‌(B.T.M Layout constituency) నియోజకవర్గంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రామలింగారెడ్డి గెలుపొందగా ఆయన కుమార్తె సౌమ్యారెడ్డి జయానగర్‌(Jayanagar)లో విజయం సాధించారు.

Updated Date - 2023-05-13T19:00:20+05:30 IST