Tomatoes : కేజీ టమాటాలు రూ.250.. అవాక్కవుతున్న వినియోగదారులు..

ABN , First Publish Date - 2023-07-07T13:20:59+05:30 IST

ఆహారం రుచికరంగా ఉండాలంటే టమాటాలు తప్పనిసరి. ఇవి ఒక్కోసారి కేజీ రూ.1కి కూడా అందుబాటులో ఉంటాయి, ఇప్పుడు మాత్రం వీటి ధరను తల్చుకుంటే ఆకాశంలో చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో వినియోగదారులు అవాక్కవుతున్నారు. గతంలో ఓ కేజీ కొనేవారు ఇప్పుడు పావు కేజీతో సరిపెట్టుకుంటున్నారు. కొందరైతే అసలు ఈ ధరాభారాన్ని తట్టుకోలేక వెనుదిరిగిపోతున్నారు.

Tomatoes : కేజీ టమాటాలు రూ.250.. అవాక్కవుతున్న వినియోగదారులు..

ఉత్తర కాశీ : ఆహారం రుచికరంగా ఉండాలంటే టమాటాలు తప్పనిసరి. ఇవి ఒక్కోసారి కేజీ రూ.1కి కూడా అందుబాటులో ఉంటాయి, ఇప్పుడు మాత్రం వీటి ధరను తల్చుకుంటే ఆకాశంలో చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో వినియోగదారులు అవాక్కవుతున్నారు. గతంలో ఓ కేజీ కొనేవారు ఇప్పుడు పావు కేజీతో సరిపెట్టుకుంటున్నారు. కొందరైతే అసలు ఈ ధరాభారాన్ని తట్టుకోలేక వెనుదిరిగిపోతున్నారు. ఉత్తరాఖండ్‌లో వీటి ధర మరిన్ని రికార్డులను సృష్టిస్తోంది.

ఉత్తర కాశీ జిల్లాలో కేజీ టమాటాల ధర రూ.180 నుంచి రూ.200 వరకు ఉంది. గంగోత్రి ధామ్ వద్ద కేజీ టమాటాల ధర రూ.250కి చేరింది. అకస్మాత్తుగా పెరిగిన ధరలను చూసి వ్యాపారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఓ వ్యాపారి మాట్లాడుతూ, టమాటాల ధరలు అకస్మాత్తుగా పెరిగాయన్నారు. గంగోత్రి, యమునోత్రిలలో కేజీ టమాటాల ధర రూ.200 నుంచి రూ.250 వరకు ఉందన్నారు. ప్రజలు వీటిని కొనలేకపోతున్నారని, కొందరు తక్కువ మొత్తంలో కొంటుండగా, మరికొందరు అసలు కొంచెం కూడా కొనకుండా వెనుదిరిగి వెళ్లిపోతున్నారని చెప్పారు.

వడగాడ్పులే కారణం

టమాటాలు పండించే ప్రాంతాల్లో వడగాడ్పులతో వాతావరణం చాలా వేడిగా ఉండటంతో వీటి దిగుబడి తగ్గిందని వ్యాపారులు తెలిపారు. మరోవైపు భారీ వర్షాల వల్ల వీటి రవాణాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. టమాటాలు నిల్వ ఉండే సమయం కూడా తక్కువేనని చెప్తున్నారు.

చెన్నైలో కేజీ టమాటాల ధర రూ.100 నుంచి రూ.130 వరకు పలుకుతోంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం రాయితీ ధరలకు వీటిని ప్రజలకు అందిస్తోంది. చెన్నైలోని రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు కేజీ టమాటాలను రూ.60కి అందిస్తోంది. కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలలో కూడా టమాటాల ధరలు విపరీతంగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :

Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్ర తాత్కాలిక నిలుపుదల

2024 Lok Sabha Elections : మోదీ సంచలన నిర్ణయం.. తమిళనాడు నుంచి పోటీ?..

Updated Date - 2023-07-07T13:20:59+05:30 IST