Share News

Khushboo, Gayatri Raghuram: ఖుష్బూ వ్యాఖ్యలపై నటి గాయత్రి రఘురాం ధ్వజం.. ఆమె ఏమన్నారంటే...

ABN , First Publish Date - 2023-10-25T11:56:43+05:30 IST

బీజేపీ నుంచి నటి గౌతమి(Actress Gauthami) వైదొలగడంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి ఖుష్బూ(Khushboo) చేసిన వ్యాఖ్యలను

Khushboo, Gayatri Raghuram: ఖుష్బూ వ్యాఖ్యలపై నటి గాయత్రి రఘురాం ధ్వజం.. ఆమె ఏమన్నారంటే...

ప్యారీస్‌(చెన్నై): బీజేపీ నుంచి నటి గౌతమి(Actress Gauthami) వైదొలగడంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి ఖుష్బూ(Khushboo) చేసిన వ్యాఖ్యలను మరో నటి గాయత్రి రఘురాం(Gayatri Raghuram) తీవ్రంగా తప్పుబట్టారు. బీజేపీ నుంచి తప్పుకుంటున్నట్లు నటి గౌతమి ప్రకటించడంపై ఖుష్బూ స్పందిస్తూ.. గౌతమి పార్టీని వీడడంపై ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమి భవిష్యత్తు కార్యాచరణ పథకాలన్నీ పార్టీ అభివృద్ధికి దోహదపడేలా వున్నాయని, కానీ ఆమె ఎందుకు వెళ్లిపోయిందో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. దీనిపై గాయత్రి సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. బీజేపీ(BJP)లో మహిళలకు గౌరవం లేదని, ఆ పార్టీలో గూండాలు, మోసగాళ్లకే తగిన గుర్తింపు వుంటుందని వ్యాఖ్యానించారు. తనకు గౌరవం లేకపోవడం వల్లనే గౌతమి బీజేపీ వీడారని పేర్కొన్నారు. ఆమె ఎందుకు పార్టీని వీడాల్సివచ్చిందో ఖుష్బూ అధిష్టానాన్ని అడిగి తెలుసుకోవాలని సూచించారు.

nani4.2.jpg

Updated Date - 2023-10-25T11:56:43+05:30 IST