Kodanadu Estate: ‘కొడనాడు ఎస్టేట్’ కేసు విచారణ వాయిదా
ABN , First Publish Date - 2023-11-25T07:48:31+05:30 IST
నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్(Kodanadu Estate) కేసు విచారణ జనవరి 5వ తేదీకి వాయిదావేస్తూ జిల్లా న్యాయస్థానం
ప్యారీస్(చెన్నై): నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్(Kodanadu Estate) కేసు విచారణ జనవరి 5వ తేదీకి వాయిదావేస్తూ జిల్లా న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత, ఆమె స్నేహితురాలు శశికళ, బంధువు ఇళవరసిలకు చెందిన టీ ఎస్టేట్లు కొడనాడులో ఉన్నాయి. ఇక్కడున్న బంగ్లాలో 2017 ఏప్రిల్ 23వ తేది అర్ధరాత్రి చొరబడిన 11 మంది ముఠా వాచ్‌మేన్ ఓంబహదూర్‌ను హతమార్చి విలువైన వస్తువులు దోచుకొని వెళ్లారు. ఈ కేసుకు సంబంధించిన విచారణలో ఊటీ(Ooty)లో ఉన్న జిల్లా న్యాయస్థానంలో కొనసాగుతున్న నేపథ్యంలో, శుక్రవారం జరిగిన విచారణకు ముద్దాయిలు సయన్, వాయలార్ మనోజ్, జితిన్‌జాయ్ మాత్రమే హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదులు ఈ కేసుకు సంబంధించి మిగతా ముద్దాయిలను విచారణ జరపాల్సి ఉందని కోరారు. ఇందుకు సమ్మతించిన న్యాయమూర్తి శ్రీధరన్, ఈ కేసు తదుపరి విచారణ 2024 జనవరి 5వ తేదీకి వాయిదావేశారు.