Share News

Laadli Behna Yojana: మహిళల ఖాతాల్లోకి రూ.1,250

ABN , First Publish Date - 2023-12-10T15:27:27+05:30 IST

మహిళా సాధికారిత దిశగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన 'లాడ్లీ బెహనా యోజన' కింద మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.1.250 ఆర్థిక సాయం సోమవారం జమ కానుంది. ప్రతినెలా 10వ తేదీన ఈ సాయం మహిళల ఖాతాల్లోకి నేరుగా ఈ మొత్తం జమ చేస్తున్నారు.

Laadli Behna Yojana: మహిళల ఖాతాల్లోకి రూ.1,250

భోపాల్: మహిళా సాధికారిత దిశగా మధ్యప్రదేశ్ (Madhya pradesh) ప్రభుత్వం ప్రకటించిన 'లాడ్లీ బెహనా యోజన' (Laadli Behna Yojana) కింద మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.1.250 ఆర్థిక సాయం సోమవారం జమ కానుంది. ప్రతినెలా 10వ తేదీన ఈ సాయం మహిళల ఖాతాల్లోకి నేరుగా ఈ మొత్తం జమ చేస్తున్నారు. ''లాడ్బీ బహనా, ఈరోజు 10వ తారీఖు'' అంటూ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారంనాడు ఒక ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని 1.31 కోట్ల మంది మహిళలు ఈ పథకం కింద లబ్ధి పొందనున్నారు.


శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో ''లాల్డీ బెహనా యోజన'' పథకం 2023లో ప్రారంభమైంది. తొలుత ప్రతి నెలా రూ.1,000 అందించే వారు. ఆ తర్వాత ఈ మొత్తాన్ని రూ.1,250కి పెంచారు. అయితే ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చౌహాన్ మరోసారి బీజేపీ అధికారంలోకి రాగానే రూ.1,500కు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ వారంలోనే అధికార పగ్గాలు చేపట్టనున్న బీజేపీ ప్రభుత్వం దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘనవిజయానికి 'లాల్డీ బెహెనా యోజన' పథకం ఒక ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలోని 230 సీట్లలో 163 స్థానాలను బీజేపీ గెలుచుకుంది.

Updated Date - 2023-12-10T15:27:28+05:30 IST