Jammu and Kashmir: జాతీయ రహదారిపై విరిగిపడిన కొండచరియలు...ట్రాఫిక్ పోలీసుల ట్వీట్

ABN , First Publish Date - 2023-02-01T11:27:40+05:30 IST

జమ్మూ కాశ్మీర్‌లోని బనిహాల్ పట్టణ పరిధిలోని రాంపరి ప్రాంతం సమీపంలో బుధవారం కొండచరియలు విరిగిపడ్డాయి...

Jammu and Kashmir: జాతీయ రహదారిపై విరిగిపడిన కొండచరియలు...ట్రాఫిక్ పోలీసుల ట్వీట్
Landslide blocks National Highway

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని బనిహాల్ పట్టణ పరిధిలోని రాంపరి ప్రాంతం సమీపంలో బుధవారం కొండచరియలు విరిగిపడ్డాయి.(Jammu and Kashmir)కొండచరియలు విరిగిపడటంతో 44వ నంబర్ జాతీయ రహదారిని(National Highway) మూసివేశారు. ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హైవేపై బండరాళ్లు పడిపోయాయని(Landslide blocks) రాంబన్ డిప్యూటీ కమీషనర్ షేర్ చేసిన వీడియోలో తెలిపారు.

జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో జమ్మూకశ్మీర్ ట్రాఫిక్ పోలీసులు జారీ చేసి ట్రాఫిక్ సలహాలను పాటించాలని రాంబన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ప్రజలకు సూచించారు. హైవే మూసివేతకు సంబంధించిన అప్‌డేట్‌ను పోలీసులు ట్వీట్ చేశారు.‘‘రాంపరి, వాగన్ బనిహాల్ వద్ద బురద కారణంగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి ఇప్పటికీ బ్లాక్ చేశాం’’ అని జమ్మూకశ్మీర్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్(tweet) చేశారు. తరచూ జమ్మూకశ్మీరులోని ఘాట్ రోడ్లపై తరచూ కొండచరియలు విరిగిపడుతుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

Updated Date - 2023-02-01T11:31:47+05:30 IST