Security Lapse: గవర్నర్ కాన్వాయ్‌ పైకి దూసుకొచ్చిన కారు..ఇద్దరి అరెస్టు

ABN , First Publish Date - 2023-07-29T18:17:54+05:30 IST

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ భద్రతా కాన్వాయ్‌లోకి ఓ కారు దూసుకొచ్చిన ఘటన‌ సంచలనమైంది. శుక్రవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని నొయిడాలో జరిగిన ఒ ప్రైవేటు కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేశారు.

Security Lapse: గవర్నర్ కాన్వాయ్‌ పైకి దూసుకొచ్చిన కారు..ఇద్దరి అరెస్టు

నొయిడా: కేరళ (Kerala) గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ (Arif Mohammad Khan) భద్రతా కాన్వాయ్‌లోకి ఓ కారు దూసుకొచ్చిన ఘటన‌ సంచలనమైంది. శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌లోని నొయిడాలో జరిగిన ఒ ప్రైవేటు కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్‌ను వేగంగా వచ్చిన స్కార్ఫియో కారు ఢీకొనడంతో భద్రతా ఉల్లంఘన జరిగింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, ఇందుకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని నొయిడా పోలీసులు తెలిపారు.


కాగా, నిందితులను ఘజియాబాద్‌కు చెందిన గౌరవ్ సోలంకి, మోను కుమార్‌లుగా గుర్తించారు. యూపీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న బ్లాక్ స్కార్ఫియో కారును సైతం సీజ్ చేశారు. సెక్టార్ 113 పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితులిద్దరూ మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించారు. ప్రమాద ఘటన అనంతరం గవర్నర్ సురక్షితంగా న్యూఢిల్లోని కేరళ హౌస్‌కు చేరుకున్నారు.

Updated Date - 2023-07-29T18:17:54+05:30 IST