Law college student: బాగానే డవలప్ అయ్యారుగా.. మద్యం మత్తులో పోలీసులపై లా కాలేజీ విద్యార్థిని చిందులు
ABN , First Publish Date - 2023-10-19T11:42:27+05:30 IST
పూటుగా తాగి స్కూటర్ నడిపి ప్రమాదానికి గురైన లా కాలేజీ విద్యార్థిని(Law college student) ఆసుపత్రి డాక్టర్లు, పోలీసులను
చెన్నై, (ఆంధ్రజ్యోతి): పూటుగా తాగి స్కూటర్ నడిపి ప్రమాదానికి గురైన లా కాలేజీ విద్యార్థిని(Law college student) ఆసుపత్రి డాక్టర్లు, పోలీసులను దుర్భాషలాడుతూ తగాదా పడింది. ఆ దృశ్యాలు సామాజిక ప్రసారమాధ్యమాల్లో వెలువడ్డాయి. కొళత్తూరు విద్యాపురానికి చెందిన రేఖ(26) లా ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బ్యూటీపార్లర్‌లో పార్ట్‌టైం పనిచేస్తోంది. సోమవారం అర్ధరాత్రి పూటుగా తాగి స్కూటర్ నడుపుకుంటూ పుత్తగరం రోడ్డుపై అదుపుతప్పి పడింది. స్థానికులు ఆమెను పెరంబూరులోని పెరియార్ ఆసుపత్రికి చేర్చారు. మద్యం మత్తులో డ్యూటీ డాక్టర్లు, నర్సులను దుర్భాషలాడసాగింది. సమాచారం అందుకున్న పెరవళ్లూరు పోలీసులు ఆసుపత్రి వద్దకు వెళ్ళారు. వీరిని కూడా ఆమె విడిచిపెట్టలేదు. మహిళా కానిస్టేబుల్‌పై దాడికి దిగి ఆమె పోలీస్ బ్యాడ్జిని, సెల్‌ఫోన్, హెడ్‌సెట్‌ను లాక్కుని నానాదుర్బాషలాడింది. పక్కనే ఉన్న మరో కానిస్టేబుల్‌ను కూడా దూషించింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆ తర్వాత కూడా ఆమె దుర్భాషలాడుతూ తాను లా కాలేజీ విద్యార్థినని, తనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని రాత్రంతా స్టేషన్‌లో అరుస్తూ గడిపింది.