Nitish Kumar: లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు..నితీష్ జోస్యం

ABN , First Publish Date - 2023-08-29T17:57:27+05:30 IST

ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే 2024 లోక్‌సభ పోల్స్ జరగవచ్చని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జోస్యం చెప్పారు. ఎన్నికలు ఏ సమయంలోనైనా జరగవచ్చని, ఒరిజినల్ షెడ్యూల్‌కే ఎన్నికలు జరుగుతాయనే గ్యారెంటీ ఏమీ లేదని మంగళవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు.

Nitish Kumar: లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు..నితీష్ జోస్యం

పాట్నా: ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే 2024 లోక్‌సభ పోల్స్ (Loksabha polls) జరగవచ్చని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) జోస్యం చెప్పారు. ఎన్నికలు ఏ సమయంలోనైనా జరగవచ్చని, ఒరిజినల్ షెడ్యూల్‌కే ఎన్నికలు జరుగుతాయనే గ్యారెంటీ ఏమీ లేదని మంగళవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. ఆసక్తికరంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం డిసెంబర్ లేదా జనవరిలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని సోమవారంనాడు కోల్‌కతాలో వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందస్తుగానే అన్ని హెలికాప్టర్లను ముందుగానే బీజేపీ బుక్ చేసుకుందని ఆమె చెప్పారు.


కాగా, మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై నితీష్ తాజాగా స్పందిస్తూ, ఎన్డీయే ముందస్తుగానే లోక్‌సభ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని చాలాకాలంగా తాను చెబుతూనే ఉన్నానని అన్నారు. గడువుకే ఎన్నికలు జరపాలనే రూలేమీ లేదన్నారు. బీజేపీని ఓడించేందుకు అన్నిపార్టీలను ఏకం చేయడమే తన కోరిక అని, ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తు్న్నామని చెప్పారు. తనకెలాంటి పదవీకాంక్ష లేదన్నారు. ఇండియా కూటమిలోకి మరికొన్ని పార్టీలు కూడా వస్తు్న్నాయని, ఆ వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.

Updated Date - 2023-08-29T18:48:13+05:30 IST