Covid-19:మహారాష్ట్రలో కరోనా కలవరం...పెరిగిన కేసులు, నలుగురి మృతి
ABN , First Publish Date - 2023-04-05T08:30:52+05:30 IST
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రబలుతోంది. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ...
ముంబయి : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రబలుతోంది. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర కలవరపడుతున్నారు.(Maharashtra) కొవిడ్(Covid-19) వల్ల ఒక్క రోజులో నలుగురు మరణించారు.మహారాష్ట్రలో మంగళవారం ఒక్కరోజే 711 కొవిడ్ పాజిటివ్(Coronavirus) కేసులు నమోదయ్యాయి. సోమవారం కంటే 24 గంటల్లోనే 463 కేసుల సంఖ్య పెరిగింది. ఇప్పటివరకు మొత్తం మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 81,46,301కి చేరింది. కరోనా మృతుల సంఖ్య కూడా 1,48,449కి పెరిగింది.
ఇది కూడా చదవండి : Kannada Star: బీజేపీలో చేరనున్న సినీస్టార్ కిచ్చా సుదీప్
ప్రస్థుతం మహారాష్ట్రలో 3,532 యాక్టివ్ కరోనా కేసులు నమోదయ్యాయి. సతార పట్టణంలో ఇద్దరు కరోనా రోగులు, పింప్రీ చించ్ వాద్ నగరంలో ఒకరు, రత్నగిరి జిల్లాలో మరొకరు కరోనాతో మరణించారని వైద్యాధికారులు ప్రకటించారు. 24 గంటల్లోనే కరోనా కేసుల సంఖ్య పెరగడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. గత 24 గంటల్లో 8,951 మందికి కరోనా పరీక్షలు చేశారు. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం, దీనివల్ల మరణిస్తుండటంతో ప్రజలు మళ్లీ భయాందోళనలు చెందుతున్నారు.