Mamata Bernajee: ఆసుపత్రిలో మమతా బెనర్జీకి వైద్య పరీక్షలు
ABN , Publish Date - Dec 30 , 2023 | 02:57 PM
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి కోల్‌కతాలోని ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రిలో శనివారంనాడు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండిగ్ సమయంలో ఆమె ఎడమ మోకాలికి, కుడి భుజానికి గాయాలయ్యాయి. రొటీన్ చెకప్‌లో భాగంగానే తాను ఆసుపత్రికి వచ్చానని, వైద్యులు పూర్తిగా పరీక్షలు జరిపారని మమతా బెనర్జీ తెలిపారు.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కోల్‌కతాలోని ఎస్ఎస్‌కేఎం (SSKM) ఆసుపత్రిలో శనివారంనాడు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండిగ్ సమయంలో ఆమె ఎడమ మోకాలికి, కుడి భుజానికి గాయాలయ్యాయి. రొటీన్ చెకప్‌లో భాగంగానే తాను ఆసుపత్రికి వచ్చానని, వైద్యులు పూర్తిగా చెక్ చేశారని మమతా బెనర్జీ తెలిపారు.
కుడి భుజానికి మైనర్ సర్జరీ జరిగిందా అని మీడియా అడిగినప్పుడు ''అదేమంత సీరియస్ కాదు. ఆందోళన పడవద్దు. సిలిగురి వద్ద ఐఏఎఫ్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ సమయంలో సమస్య తలెత్తింది. రెండు కాళ్లు, భుజానికి గాయాలయ్యాయి. ఈరోజు పూర్తిగా వైద్యపరీక్షలు జరిపారు. ఇబ్బందేమీ లేదు. మామూలుగానే నడుస్తున్నాను. రోజూ 20,000 అడుగులు నడక సాగిస్తున్నాను'' అని మమత తెలిపారు. ఆసుపత్రిలో మూడు గంటల సేపు వైద్యపరీక్షల అనంతరం మమతా బెనర్జీ తిరిగి బయలుదేరుతూ, రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. స్నేహం కోసం ప్రార్థించు, మానవత్వం, శాంతి సాధించు...అంటూ ఠాగూర్ కవితలోని కొన్ని లైన్స్ వినిపించారు. గత సెప్టెంబర్‌లో 12 రోజుల పాటు స్పెయిన్, దుబాయ్‌లో మమతా బెనర్జీ పర్యటించినప్పుడు ఎడమ మోకాలికి మరోసారి గాయమైంది.