Share News

Mukesh Ambani:అంబానీకి మళ్లీ బెదిరింపులు.. ఇద్దరు అరెస్ట్.. నిందితులలో తెలంగాణ యువకుడు

ABN , First Publish Date - 2023-11-04T16:18:53+05:30 IST

రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) అధినేత ముఖేష్ అంబానీ(Mukesh Ambani) టార్గెట్ గా వరుస బెదిరింపుల ఈమెయిల్స్ రావడం వ్యాపారా వర్గాల్లో కలకలం రేపుతోంది. తాజాగా తెలంగాణ(Telangana)కు చెందిన ఓ వ్యక్తి ముఖేష్ ని హత్య చేస్తానని బెదిరించారు. నిందితుడిని తెలంగాణకు చెందిన గణేష్ రమేష్ వనపర్తి(19)గా గుర్తించారు.

Mukesh Ambani:అంబానీకి మళ్లీ బెదిరింపులు.. ఇద్దరు అరెస్ట్.. నిందితులలో తెలంగాణ యువకుడు

ముంబయి: రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) అధినేత ముఖేష్ అంబానీ(Mukesh Ambani) టార్గెట్ గా వరుస బెదిరింపుల ఈమెయిల్స్ రావడం వ్యాపారా వర్గాల్లో కలకలం రేపుతోంది. తాజాగా తెలంగాణ(Telangana)కు చెందిన ఓ వ్యక్తి ముఖేష్ ని హత్య చేస్తానని బెదిరించారు. నిందితుడిని తెలంగాణకు చెందిన గణేష్ రమేష్ వనపర్తి(19)గా గుర్తించారు. అతను ముకేష్ అంబానీ హత్య చేస్తానని బెదిరింపు మెయిల్స్ పంపాడు. దర్యాప్తు ప్రారంభించిన ముంబయి పోలీసులు అతన్ని గుర్తించి అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరు పరిచారు. నిందితుడికి కోర్టు నవంబర్ 8వరకు రిమాండ్ విధించింది. మరో నిందితుడు షాబాద్ ఖాన్ (19)ను ముంబయిలోని గామ్‌దేవి ప్రాంతంలో అరెస్టు చేశారు.


వరుసగా ముఖేష్ అంబానీకి బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపుతోంది. గడిచిన నాలుగు రోజుల్లోనే ఏకంగా మూడు సార్లు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. అక్టోబర్ 27, 28 తేదీల్లో అంబానీకి బెదిరింపు ఇలాగే మెయిల్స్ వచ్చాయి. 27వ తేదీన రూ.20 కోట్లు డిమాండ్‌ చేసిన దుండగులు.. ఆ తర్వాతి రోజు రూ.200 కోట్లు ఇవ్వాలని హెచ్చరించారు. అక్టోబర్‌ 30న రూ.400 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. లేదా అంబానీని హత్య చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మూడు బెదిరింపులు షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి మెయిల్‌ ఐడీ నుంచి వచ్చినట్లు ముంబయి పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అక్టోబర్‌ 31 నవంబర్‌ 1వ తేదీ మధ్య మరో మెయిల్‌ కూడా వచ్చినట్లు గుర్తించారు. తమ దగ్గర ఆరితేరిన షూట‌ర్లు ఉన్నారని.. వారు అంబానీని కాల్చేస్తార‌ని బెదిరించారు. అప్రమత్తమైన ముంబయి పోలీసులు(Mumbai Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెయిల్ ఐడీ సదరు వ్యక్తికి సంబంధించినదేనా లేక ఫేక్ ఐడీతో ఈ మెయిల్స్ పంపారా అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ జరుపుతున్నారు. అంబానీకే కాకుండా ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకుని సైతం గతంలో బెదిరింపు కాల్స్ వచ్చాయి. వారిని టార్గెట్ చేసుకున్న బిహార్ కు చెందిన ఓ వ్యక్తిని గతేడాది ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణ ముంబయిలోని అంబానీ కుటుంబ నివాసం 'యాంటిలియా'తో పాటు హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌ను పేల్చివేస్తానని నిందుతుడు బెదిరించాడు.

Updated Date - 2023-11-04T16:55:54+05:30 IST