Manipur : హైడ్రామా మధ్య రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సీఎం

ABN , First Publish Date - 2023-06-30T17:25:26+05:30 IST

హైడ్రామా మధ్య తన రాజీనామా నిర్ణయాన్ని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ శుక్రవారంనాడు వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుతుల్లో తాను రాజీనామా చేయడం లేదంటూ ఆయన తాజాగా ట్వీట్ చేశారు. దీంతో ఆయనకు మద్దతుగా ఉదయం నుంచి నుపిలాల్ క్లాంప్లెక్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న మహిళలు శాంతించారు.

Manipur : హైడ్రామా మధ్య రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సీఎం

ఇంఫాల్: హైడ్రామా మధ్య తన రాజీనామా నిర్ణయాన్ని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ (N.Biren Singh) శుక్రవారంనాడు వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుతుల్లో తాను రాజీనామా చేయడం లేదంటూ ఆయన తాజాగా ట్వీట్ చేశారు. దీంతో ఆయనకు మద్దతుగా ఉదయం నుంచి నుపిలాల్ క్లాంప్లెక్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న మహిళలు శాంతించారు.

అడుగడుగునా ఉత్కంఠ.....

మణిపూర్‌లో గురువారం మరోసారి హింస ప్రజ్వరిల్లి ముగ్గురు ప్రాణాలు కోల్పోడవం, ఐదుగురు గాయపడటంతో నిరసనలు పెల్లుబికాయి. ఈ నేపథ్యంలో బీరేన్ సింగ్ రాజీనామా చేస్తారని, రాష్ట్రపతి పాలన విధిస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గవర్నర్‌ను బీరేన్ సింగ్ కలుసుకుని రాజీనామా సమర్పిస్తున్నట్టు ప్రచారం జరిగింది. దీంతో ఉదయం నుంచి ఉత్కంఠ నెలకొంది. పెద్దఎత్తున మహిళలు బీరేన్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. సీఎం నివాసం వెలుపల వందల సంఖ్యలో మహిళలు ఆందోళనకు దిగారు. బీరేన్ తమకు ఎంతో చేశారని, ఆయన సీఎంగా కొనసాగాలని, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఆయన రాజీనామా చేస్తే ప్రజలకు దిక్కెవరంటూ నిలదీశారు. గవర్నర్ నివాసానికి వెళ్లే రోడ్డును సైతం దిగ్బంధించారు.

ఒక దశలో బీరేన్ సింగ్ తన నివాసం నుంచి వెలుపలకు వచ్చి వారికి నచ్చజెప్పాలని అనుకున్నప్పటికీ భద్రతా సిబ్బంది ఆయనను వెనక్కి పంపించేశారు. మధ్యాహ్నం 2.20 గంటల ప్రాంతంలో సీఎం, 20 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ నివాసానికి వెళ్లేందుకు బయటకు వచ్చారు. పీడబ్ల్యూడీ మంత్రి సహా పలువురు మంత్రులు నేరుగా మహిళల వద్దకు వెళ్లి సీఎం రాజీనామా ఇవ్వాలనుకుంటున్న పత్రాన్ని వారికి చూపించారు. దీంతో అక్కడి మహిళలు ఆ పత్రాన్ని లాక్కుకి ముక్కలు ముక్కలుగా చింపేశారు. ఈ క్రమంలో గవర్నర్‌కు రాజీనామా ఇవ్వాలనే ఆలోచనను సీఎం బీరేన్ సింగ్ వెనక్కి తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత కీలక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని సీఎం పదవికి తాను రాజీనామా ఇవ్వడం లేదంటూ బీరేన్ సింగ్ ఓ ట్వీట్‌లో వివరణ ఇచ్చారు.

Updated Date - 2023-06-30T20:20:01+05:30 IST