Manish Sisodia: బీజేపీపై విరుచుకుపడ్డ మనీష్ సిసోడియా...జైలు నుంచి తాజా ట్వీట్

ABN , First Publish Date - 2023-03-11T12:08:20+05:30 IST

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టు అయిన ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా శనివారం జైలు నుంచి ట్వీట్ చేశారు....

Manish Sisodia: బీజేపీపై విరుచుకుపడ్డ మనీష్ సిసోడియా...జైలు నుంచి తాజా ట్వీట్
Manish Sisodia

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టు అయిన ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా శనివారం జైలు నుంచి ట్వీట్ చేశారు. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైలు నుండి తన తాజా ట్వీట్‌లో బీజేపీపై విరుచుకుపడ్డారు.ప్రధాని మోదీని ఉద్ధేశించి సిసోడియా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘సార్, మీరు నన్ను జైలులో పెట్టడం ద్వారా నన్ను ఇబ్బంది పెట్టవచ్చు. కానీ నా ఆత్మను విచ్ఛిన్నం చేయలేరు’’ అని సిసోడియా ట్వీట్ చేశారు. భారతీయ స్వాతంత్ర్య సమరయోధులు బ్రిటిష్ వారితో ఇబ్బందులు పెట్టిన నాటి రోజులను కూడా సిసోడియా గుర్తుచేసుకున్నారు. తన ప్రస్తుత పరిస్థితిని భారతదేశ స్వాతంత్ర్య పోరాటంతో పోల్చారు.

ఇది కూడా చదవండి : Jobs scam: బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్‌కు సీబీఐ సమన్లు

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దాదాపు ఎనిమిది గంటల విచారణ అనంతరం ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది.మనీష్ సిసోడియా సమాధానాలు సంతృప్తికరంగా లేవని, విచారణకు ఆయన సహకరించడం లేదని సీబీఐ పేర్కొంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిసోడియా, సత్యేంద్ర జైన్‌లు మార్చి 1న తమ రాజీనామాలను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు అందజేశారు.శుక్రవారం సిసోడియాను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది.మద్యం పాలసీ కేసులో మనీష్ సిసోడియాకు ఢిల్లీ కోర్టు శుక్రవారం ఏడు రోజుల కస్టడీని మంజూరు చేసింది.

Updated Date - 2023-03-11T12:10:00+05:30 IST