Mask: 17నుంచి ‘మాస్కు’ తప్పనిసరి

ABN , First Publish Date - 2023-04-15T14:28:11+05:30 IST

ఈనెల 17న సోమవారం నుంచి మాస్కు(Mask) ధారణ తప్పనిసరి అని

Mask: 17నుంచి ‘మాస్కు’ తప్పనిసరి

పెరంబూర్‌(చెన్నై): మద్రాసు హైకోర్టు, హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌ ప్రాంగణాల్లో ఈనెల 17న సోమవారం నుంచి మాస్కు(Mask) ధారణ తప్పనిసరి అని న్యాయశాఖ రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మాస్కు ధారణ తప్పనిసరి చేయగా, బహిరంగ ప్రాంతాల్లో ప్రజలు మాస్కు తప్పక ధరించాలని ఆరోగ్యశాఖ సూచిస్తోంది. ఈ నేపథ్యంలో, మద్రాసు హైకోర్టు(Madras High Court), హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌ ప్రాంగణాల్లో ఈ నెల 17వ తేది నుంచి మాస్కు ధారణ తప్పనిసరి అంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. న్యాయవాదులు, సిబ్బంది, విచారణలకు హాజరయ్యే వారు తప్పనిసరిగా మాస్కు ధరించాలి.

Updated Date - 2023-04-15T14:28:11+05:30 IST