Mettur Dam: ‘మేట్టూరు’కు భారీగా పెరుగుతున్న ఇన్‌ఫ్లో

ABN , First Publish Date - 2023-07-28T07:48:26+05:30 IST

మేట్టూరు డ్యాం(Mettur Dam)లోకి కావేరి జలాల వస్తుండడంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. కర్ణాటక రాష్ట్రం(Karnataka State)లోని

Mettur Dam: ‘మేట్టూరు’కు భారీగా పెరుగుతున్న ఇన్‌ఫ్లో

పెరంబూర్‌(చెన్నై): సేలం జిల్లా మేట్టూరు డ్యాం(Mettur Dam)లోకి కావేరి జలాల వస్తుండడంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. కర్ణాటక రాష్ట్రం(Karnataka State)లోని కబిని, కృష్ణరాజసాగర్‌ డ్యాంలు పూర్తిస్థాయికి చేరువలో ఉండడంతో ఆ రెండు డ్యాం నుంచి సుమారు 22 వేల ఘనపుటడుగుల నీటిని కావేరి నదిలోకి విడుదల చేస్తున్నారు. కాగా, గురువారం ఉదయం గణాంకాల ప్రకారం మేట్టూరు డ్యాంలోకి 3,343 ఘనపుటడుగుల నీరు వస్తుండగా, డెల్టా జిల్లాల సాగుకు 12 వేల ఘనపుటడుగులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాం నీటిమట్టం 64.87 అడుగులు (పూర్తి సామర్ధ్యం 120 అడుగులు) ఉన్నట్లు ప్రజాపనుల శాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2023-07-28T07:48:26+05:30 IST