Minister: ఆసుపత్రి నుంచి నేరుగా జైలుకే.. ఫస్ట్‌ క్లాస్‌ వసతులతో ఉన్న గది కేటాయింపు

ABN , First Publish Date - 2023-07-18T09:10:27+05:30 IST

స్థానిక ఆళ్వార్‌పేటలోని కావేరి ఆసుపత్రి(Kaveri Hospital)లో బైపాస్‌ సర్జరీ చేయించుకున్న మంత్రి సెంథిల్‌ బాలాజీని సోమవారం సా

Minister: ఆసుపత్రి నుంచి నేరుగా జైలుకే.. ఫస్ట్‌ క్లాస్‌ వసతులతో ఉన్న గది కేటాయింపు

ప్యారీస్‌(చెన్నై): స్థానిక ఆళ్వార్‌పేటలోని కావేరి ఆసుపత్రి(Kaveri Hospital)లో బైపాస్‌ సర్జరీ చేయించుకున్న మంత్రి సెంథిల్‌ బాలాజీని సోమవారం సాయంత్రం పుళల్‌ జైలుకు తరలించారు. అక్రమార్జన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌(Enforcement) అధికారులు జూన్‌ 13వ తేది అర్ధరాత్రి మంత్రి సెంథిల్‌ బాలాజిని ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన మంత్రిని ముందుగా అన్నాసాలైలోని ఓమందూర్‌ ప్రభుత్వ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కోర్టు అనుమతితో కుటుంబీకులు కావేరి ఆసుపత్రికి సెంథిల్‌ బాలాజీ(Senthil Balaji)ని తరలించారు. అక్కడ ఆయనకు నిర్వహించిన వైద్యపరీక్షల్లో గుండెకు వెళ్లే రక్తనాళాల్లో నాలుగు ప్రాంతాల్లో గడ్డ కట్టి ఉన్నట్లు గుర్తించి జూన్‌ 21వ తేది బైపాస్‌ సర్జరీ చేశారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న సెంథిల్‌ బాలాజీకి న్యాయస్థానం జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి చక్కబడిన కారణంగా కావేరి ఆసుపత్రి నుంచి సోమవారం సాయంత్రం 5 గంటలకు డిశ్చార్జి చేశారు. అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో పుళల్‌ జైలు వైద్యులు, అధికారులు సెంథిల్‌ బాలాజిని జైలుకు తీసుకెళ్లారు. ఈనెల 26వ తేది వరకు జ్యుడిషియల్‌ కస్టడీ కొనసాగనున్న కారణంగా మంత్రి సెంథిల్‌ బాలాజికి రెండవ నెంబరు జైలులో ఫస్ట్‌ క్లాస్‌ వసతులతో కూడిన గదిని కేటాయించారు. ఈ నేపథ్యంలో, జైలులో ఉన్నంత వరకు సెంథిల్‌ బాలాజికి జైలు వైద్యులు చికిత్స అందించాలని న్యాయమూర్తి భరత చక్రవర్తి ఆదేశాలు జారీ చేశారు.

nani4.2.jpg

Updated Date - 2023-07-18T09:10:27+05:30 IST