Minister: చిరు వ్యాపారులైనా సరే.. లైసెన్స్ తప్పనిసరి
ABN , First Publish Date - 2023-10-08T10:55:24+05:30 IST
జిల్లాలో అనేక చిరువ్యాపారాల దుకాణాలు, హోటళ్ళు, వాణిజ్య దుకాణాలు ట్రేడ్ లైసెన్సులు పొందలేదని, రిజిస్ట్రేషన్
బళ్లారి సిటీ(బెంగళూరు): జిల్లాలో అనేక చిరువ్యాపారాల దుకాణాలు, హోటళ్ళు, వాణిజ్య దుకాణాలు ట్రేడ్ లైసెన్సులు పొందలేదని, రిజిస్ట్రేషన్ చేసుకోలేదని వారికి అవగాహన కల్పించి లైసెన్స్ పొందేలా చూడాలని కార్మిక శాఖ మంత్రి సంతోష్లాడ్(Minister Santosh Lad) అధికారులను ఆదేశించారు. నగరంలోని జిల్లాపంచాయతీ హాల్లో శనివారం బళ్లారి, విజయనగరం, కార్మికశాఖ ప్రగతి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలు, కేసుల పరిష్కారం, బకాయిల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ కోర్టు అధికారులను ఆదేశించింది. నకిలీ పత్రాలు సృష్టించి లేబర్ కార్డులు పొందిన వారి కార్డులను రద్దు చేయాలన్నారు. కార్మిక శాఖపై ప్రజలకు చాలా నమ్మకం ఉంది. విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పని చేయాలని అధికారులకు సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న నమోదిత కార్మికులకు వైద్య, సౌకర్యం, ప్రసూతి భత్యం, వివాహ భత్యం సహా వివిధ దరఖాస్తులను వెంటనే ప రిష్కరించాలన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అధికారులు కృషి చే యాలని, వారికి రక్షణ కల్పించేందుకు టాష్క్‌ను పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. యువజన సాదికారత, క్రీడలు, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జిమంత్రి బి.నాగేంద్ర, కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్టటరీ మహ్మద్ మోహిసిన్, లేబర్ కమిషనర్ గోపాల్ కృష్ణ, లేబర్ బోర్డు సీఈఓ సెక్రటరీ భారతి, ప్యాక్టరీ , బాయిలర్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, వరదరాజ్, వివిధ అధికారులు పాల్గొన్నారు.